అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీబీఐని అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.  చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో  ఏపీ రాష్ట్రంలో సీబీఐకు అనుమతిని నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఏపీ రాష్ట్రానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా గత నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. జగన్ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత  సీబీఐకు అనుమతివ్వాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు ఇవాళ 81 నెంబర్ జీవోను విడుదల చేశారు.

చంద్రబాబునాయుడు సర్కార్  2018 నవంబర్ 8వ తేదీన 176 జీవోను జారీ చేసింది.  ఈ జీవోను రద్దు చేస్తూ గురువారం నాడు 81 నెంబర్ జీవోను ఏపీ సర్కార్ జారీ చేసింది.ఈ జీవో కాపీని సీబీఐకు కూడ పంపింది.  ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఏపీ సర్కార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.