ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ:అక్టోబర్ 1న బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీన సమీర్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న రిటైర్ కానున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ కొనసాగుతున్నారు. ఈ నెల 30వ తేదీ న ఆదిత్యనాథ్ దాస్ రిటైర్ కానున్నారు.
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆదిత్యనాథ్ దాస్ కి మూడు మాసాల పాటు ఎక్స్‌టెన్షన్ ఇచ్చింది. మరోసారి ఆదిత్యనాధ్ దాస్ సర్వీసు పొడిగింపునకు ఏపీ ప్రభుత్వం సుముఖంగా లేదు. దీంతో కొత్త రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికకే జగన్ సర్కార్ మొగ్గుచూపింది.
ఏపీ సీఎస్ రేసులో ఉన్న ఐఎఎస్‌లలో సమీర్ శర్మ ను జగన్ సర్కార్ ఎంపిక చేసుకొంది.ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ కొనసాగుతున్నారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సమీర్ శర్మ ఆప్కో ఎండీగా పనిచేశారు.