సారాంశం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు (retirement age) 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) ఆర్డినెన్స్ జారీ చేసింది. 2022 జనవరి 1నుంచి ఈ ఉత్వర్వులు అమలు చేయనున్నట్టుగా ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు (retirement age) 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) ఆర్డినెన్స్ జారీ చేసింది. 2022 జనవరి 1నుంచి ఈ ఉత్వర్వులు అమలు చేయనున్నట్టుగా ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. కాగా ,ఇటీవల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకి ప్రభుత్వం పెంచుతూ.. మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ సోమవారం సంతకం చేశారు.
ఇక, పదవీ విరమణ వయసుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం వరకు ఆర్డినెన్స్ రాకపోవడంతో నేడు రిటైర్ కావాల్సిన ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటివకే ఆయా విభాగాల ఉద్యోగులకు పదవీ విరమణ దస్త్రాలు చేరాయి. అయితే మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో గందగోళానికి తెరపడింది. ఈరోజు పదవీ విరమణ చేసే వారికి ఊరట లభించింది.
ఇదిలా ఉంటే ఏపీలో పీఆర్సీ జీవోలపై వివాదం కొనసాగుతుంది. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్నారు. మరోవైపు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అయితే కమిటీతో చర్చలు జరిపేందుకు పీఆర్సీ సాధన సమితి నిరాకరించింది. అయితే తమ డిమాండ్లతో కూడిన లేఖను ప్రభుత్వ కమిటీకి అందజేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన కూడా వారు రావడం లేదని మంత్రులు చెబుతున్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని వారు చెప్పుకొస్తున్నారు.
అయితే ఉద్యోగ సంఘాల ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ఇప్పటికే తాము చాలా సార్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలు ఏకపక్షంగా తీసుకోచ్చిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్‌ను బయటపెట్టాలని, పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.