Asianet News TeluguAsianet News Telugu

ఏపీ బడ్జెట్ 2020: పోలీసులకు ఇన్సూరెన్స్ రూ. 20 లక్షలకు పెంపు

పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో మరణిస్తే ప్రస్తుతం ఇస్తున్న ఇన్సూరెన్స్ ను రూ. 13 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
 

Ap government increases personal insurance to police  RS.13 to 20 lakh
Author
Amaravathi, First Published Jun 16, 2020, 3:35 PM IST

అమరావతి: పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో మరణిస్తే ప్రస్తుతం ఇస్తున్న ఇన్సూరెన్స్ ను రూ. 13 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 

also read:ఏపీ బడ్జెట్ 2020: కాపు మహిళల ఉపాధికి రూ. 350 కోట్లు

విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించిన అన్ని తరగతుల పోలీసు సిబ్బందికి పెంచిన ఇన్సూరెన్స్ వర్తిస్తోందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.2019 అక్టోబర్ 1వ తేదీ నుండి  హోంగార్డుల విధి నిర్వహణ భత్యాన్ని రోజుకు రూ. 600 నుండి రూ. 710కి పెంచినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.పోలీసు శాఖకు చెందిన 2020-21 ఆర్ధిక సంవత్సరానికి రూ. 5,988.72 కోట్లు కేటాయించినట్టుగా ఆయన తెలిపారు.

20 ఏళ్ల తర్వాత ఇన్సూరెన్స్ ను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.కానిస్టేబుల్స్ కు రూ. 13 లక్షల నుండి రూ. 20 లక్షలు, ఎస్ఐలు, సీఐలకు రూ. 35 లక్షలకు, డీఎస్పీలకు రూ. 45 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 4.74 కోట్లను ఇప్పటికే చెల్లించింది. అసహజ మరణానికి రూ. 30 లక్షలను చెల్లించాలని నిర్ణయం తీసుకొంది. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన పోలీసులకు రూ. 40 లక్షలు చెల్లించాలని నిర్ణయం తీసుకొన్నారు.  రాష్ట్రంలోని 64,719 మంది పోలీసులకు ఈ ఇన్సూరెన్స్ పథకం కింద వర్తించనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios