అమరావతి: కాపుల సంక్షేమంపై ఏపీ ప్రభుత్వం కేంద్రీకరించింది. కాపు సామాజిక వర్గ సంక్షేమం తమ ప్రభుత్వ విధానాల్లో ముఖ్యమైందిగా ప్రభుత్వం తెలిపింది.కాపు మహిళలకు ఉపాధికి రూ. 350 కోట్లు కేటాయిస్తున్నట్టుగా ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 

also read:ఏపీ బడ్జెట్ 2020: వైద్యఆరోగ్యశాఖలో 9700 ఉద్యోగాల భర్తీ

2019-20 ఆర్ధిక సంవత్సరంలో కాపు సామాజిక వర్గానికి చెందిన  వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం  ప్రభుత్వం స్పష్టమైన కేటాయింపులు చేసిందని  ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర సాంఘిక ఆర్ధికాభివృద్ధిలో కాపు సామాజిక వర్గం సముచితమైన పాత్ర నిర్వహించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఆయన పేర్కొన్నారు.

కాపు నేస్తం పథకం కింద ప్రతి ఏటా రూ. 15 వేలను ప్రతి మహిళకు కేటాయించినట్టుగా మంత్రి ప్రకటించారు..ఐదేళ్లపాటు ప్రతి మహిళకు ఉపాధి కోసం ఈ నిధులను ఖర్చు చేస్తామన్నారు. ప్రతి కాపు  మహిళకు జీవనోపాధికి రూ. 350 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని ఆయన తెలిపారు.ఐదేళ్ల పాటు కాపు మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని  మంత్రి తెలిపారు.