అమరావతి: అమరావతి ప్రాజెక్టుకు రుణాలు ఉపసంహరించుకున్న వరల్డ్ బ్యాంకు, ఏఐఐబిలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. రెండు బ్యాంకులు రుణాలను ఉపసంహరించుకోవడానికి గల కారణాలపై క్లారిటీ ఇచ్చింది.  

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్లే వరల్డ్ బ్యాంకు, ఏఐఐబీలు రుణ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఏఐఐబీ ఎన్నో ప్రాజెక్టులు మంజూరు చేసిందని, ఏఐఐబీ మంజూరు చేసిన ప్రాజెక్టులు ఇకపై వేగవంతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 

రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులకు 940 మిలియన్ డాలర్లను ఏఐఐబీ ఇచ్చిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణాలు ఉపసంహరించుకున్నప్పటికీ మరింత సాయం చేసేందుకు ఇరు బ్యాంకులు అంగీకారం తెలిపాయని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం నిధులు సద్వినియోగం చేసుకోవడంలో, పనులు ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైందని ప్రభుత్వం ఆరోపించింది.