పీఆర్సీ అమలుకు కమిటీ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ ఛైర్మన్‌ నివేదికపై అధ్యయనానికి సీఎస్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. 

పీఆర్సీ అమలుకు కమిటీ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ ఛైర్మన్‌ నివేదికపై అధ్యయనానికి సీఎస్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది.

సభ్యులుగా సీఎం ముఖ్యసలహాదారు, రెవెన్యూ, ఆర్థిక, జీఏడీ అధికారులను నియమించింది. ఆర్టీసీ విలీనంతో సిబ్బందికి పీఆర్సీ అమలుపై కమిటీ చర్చించనుంది.

పీఆర్సీ సిఫార్సులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 11వ పీఆర్సీ ఛైర్మన్‌ అశుతోష్‌ మిశ్రా ఇచ్చిన నివేదికపై అధ్యయనానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్