ఏపీ హైకోర్టు ఆదేశాలు: దిగొచ్చిన జగన్ సర్కార్

చెత్త నుండి సంపద తయారీ చేసే కేంద్రాలకు పార్టీ రంగులు వేయడంపై పంచాయితీరాజ్ శాఖ బుధవారం నాడు ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పంచాయితీ రాజ్ శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది  ఈ అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించారు.

AP government files affidavit over party colours on government buildings

అమరావతి: జగన్ సర్కార్ ఎట్టకేలకు దిగొచ్చింది. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్టుగా ap high courtలో బుధవారం నాడు అఫిడవిట్ దాఖలు చేసింది. 

భవిష్యత్తులో   ప్రభుత్వ భవనాలకు  పార్టీ రంగులు వేయబోమని పంచాయితీరాజ్ శాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఆ affidavitలో పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెత్త నుండి  పంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు వేస్తున్నారని జైభీమ్ జస్టిస్ సంస్థ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సురేష్ హైకోర్టులో pil దాఖలు చేశారు. 

also read:జడ్జిలపై అభ్యంతరకర వ్యాఖ్యలు: ఏపీ హైకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించిన సీబీఐ

ఈ పిల్ పై పిటిషనర్ తరపున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదించారు. తక్షణమే ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులను తొలగించాలని అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ఆదేశించింది.

ఉన్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అఫిడవిల్ దాఖలు చేశారు.గతంలో ఏపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై కూడ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios