Asianet News TeluguAsianet News Telugu

జడ్జిలపై అభ్యంతరకర వ్యాఖ్యలు: ఏపీ హైకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించిన సీబీఐ

జడ్జిలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సు సీబీఐ అధికారులు బుధవారం నాడు ఏపీ హైకోర్టుకు అందించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను  అరెస్ట్ చేశామని సీబీఐ అధికారులు ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు.

CBI submits status report to AP high court  over social media posts on judges
Author
Guntur, First Published Oct 6, 2021, 2:57 PM IST

అమరావతి: జడ్జిలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సీబీఐ అధికారులు బుధవారం నాడు ఏపీ హైకోర్టుకు సమర్పించారు.ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.

also read:జడ్జిలపై అభ్యంతర వ్యాఖ్యలు: మరో ఛార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ

విదేశాల్లో ఉంటున్న నిందితుల అరెస్ట్ కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారని  హైకోర్టు ప్రశ్నించింది. ఇతర ఏజెన్సీల సహాయంతో  నిందితుల అరెస్ట్ కు ప్రయత్నిస్తున్నామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఈ కేసు విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.

జడ్జిలకు, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ap high courtలో  గత ఏడాది పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది హైకోర్టు. ఈ అంశంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ 2020 అక్టోబర్ 8వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. 

CBI విచారణకు ముందు ఈ కేసును ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. ap cid  విచారణ సక్రమంగా లేదని  భావించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో సీఐడీ అధికారుల విచారణకు సంబంధించిన సమాచారాన్ని కూడ సీబీఐ అధికారులు సేకరించారు. 

ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో సీబీఐ నలుగురిపై వేర్వేరుగా ఛార్జీషీట్లను దాఖలు చేసింది. ఆదర్శ్ రెడ్డి, కొండారెడ్డి, సాంబశివారెడ్డి,సుధీర్  లపై అభియోగాలను మోపింది. వీరిని ఈ ఏడాది జూలై, ఆగస్టు 7 తేదీల్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios