ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు జగన్‌కు జడ్ క్యాటగిరీ సెక్యూరిటీని అమలు చేస్తోంది ప్రభుత్వం.

ఇక తాజాగా ఆయనకు కొత్త కాన్వాయ్‌ని కేటాయించింది. జగన్ కాన్వాయ్‌లో 6 స్ట్రామ్ వాహనాలు ఉండనున్నాయి. AP 18P 3418 నెంబర్‌తో ఈ కాన్వాయ్ ఉంటుంది. వైసీపీ ఘన విజయం తర్వాత ఒక్కసారిగా జగన్ నివాసానికి నేతలు, కార్యకర్తల తాకిడి పెరిగింది.

దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఇక జగన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌‌గా.. చంద్రబాబు సెక్యూరిటీని చూసిన అమర్లపూడి జోషిని ఏపీ పోలీస్ శాఖ నియమించింది.