ఏపీ ఉద్యోగుల సమ్మె సైరన్: జీఏడీ సెక్రటరీకి యూనియన్ నేతల నోటీసు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం సెక్రటరీ శశిభూషణ్ కు సోమవారం నాడు ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ GAD సెక్రటరీ Shashi bhushanకు పీఆర్సీ సమితి స్టీరింగ్ కమిటీ నేతలు సోమవారం నాడు సమ్మె నోటీసు ఇచ్చారు.PRC జీవోలను వెనక్కి తీసకోవాలనే డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్లతో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెకు దిగనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ నుండి Employees Union నేతలు Strike కివెళ్లనున్నారు.జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ కు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డిలు అందజేశారు.
పీఆర్సీ విషయంలో తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు జారీ చేశారని సమ్మె నోటీసులో ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని కూడా ఎంప్లాయిస్ డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.
ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు. అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి. ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలోని జీఏడీ సెక్రటరీ కార్యాలయానికి వెళ్లిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు సమ్మె నోటీసు ఇచ్చారు.