అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్: కాలువ

Ap government decides to sale Agrigold assets says minister Kaluva Srinivasulu
Highlights

అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి ప్రభుత్వం ఒకే

అమరావతి:   విజయవాడలోని అగ్రిగోల్డ్ కు చెందిన 5 ఆస్తులను  వేలం వేయాలని ఏపీ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొంది.  కేబినేట్ సమావేశం మంగళవారం నాడు  అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశం వివరాలను  ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం మీడియాకు వివరించారు. అగ్రిగోల్డ్‌కు  వ్యవహరంపై కేబినెట్ సమావేశంలో చర్చించినట్టు ఆయన చెప్పారు. అగ్రిగోల్డ్ చిన్న మొత్తాల డిపాజిటుదారులపై కూడ చర్చించినట్టు ఆయన చెప్పారు.

జనవరి 2019 నాటికి 19 లక్షల ఇళ్ళను నిర్మించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. అర్హులందరికీ ఇళ్ళను నిర్మించాలని ఈ సమావేశం తీర్మాణం చేసింది. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల ఫీజును పరిమితంగా ఫీజులను పెంచుకొనే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీ యాజమాన్యాలకు ఇచ్చింది.

దీపా మెమోరియల్ ట్రస్ట్ బకాయిల రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఈ ట్రస్ట్‌కు 0.75 ఎకరాలను కేటాయించాలని కూడ నిర్ణయించారు. శ్రీకాకుళంలో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు కోసం 17 ఎకరాల స్థలం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినేట్.కడపలో హైడల్ విద్యుత్ ప్రాజెక్టు కోసం రూ. 118 ఎకరాలను కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నారు. విశాఖలో కామన్ వెల్త్ గేమ్ లో విజేత మాణిక్యాలరావుకు 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 

loader