Asianet News TeluguAsianet News Telugu

జగన్ గుడ్‌న్యూస్: చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 3 మాసాల విద్యుత్ బిల్లులు మాఫీ

:లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మూడు మాసాలకు సంబంధించిన  విద్యుత్ బిల్లులను రద్దు చేస్తున్నట్టుగా  ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడు మాసాలకు సంబంధించి రూ. 188 కోట్లను మాఫీ చేస్తున్నట్టుగా సీఎం జగన్ తెలిపారు.
 

Ap government cancels three months electricity bills for msme units
Author
Amaravathi, First Published May 22, 2020, 12:45 PM IST

అమరావతి:లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మూడు మాసాలకు సంబంధించిన  విద్యుత్ బిల్లులను రద్దు చేస్తున్నట్టుగా  ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడు మాసాలకు సంబంధించి రూ. 188 కోట్లను మాఫీ చేస్తున్నట్టుగా సీఎం జగన్ తెలిపారు.

శుక్రవారం నాడు వీడియో కాన్పరెన్స్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు చేయూత ఇచ్చేందుకు  ఆర్ధిక ప్రోత్సహకాలను ప్రకటించింది ప్రభుత్వం.

also read:ఏపీ సర్కార్‌కు హైకోర్టు షాక్: జీవో 623 సస్పెండ్

చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సాహించేందుకు  వీలుగా తొలి విడతగా ఇవాళ రూ.450 కోట్లను విడుదల చేశారు సీఎం జగన్.వచ్చే నెలలో మిగిలిన మొత్తాన్ని కూడ విడుదల చేయనున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు. రెండు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 1110 కోట్లను పారిశ్రామికవేత్తలకు చెల్లించనుంది.

Ap government cancels three months electricity bills for msme units

 రాష్ట్రంలోని 97 వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ ఆర్దిక సహాయం అందనుందని ప్రభుత్వం ప్రకటించింది. ఎంఎస్ఎంఈలపై ఆధారపడ్డ సుమారు 10 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.

ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉపాధిని కల్పించేవి చిన్న, మధ్యతరహా పరిశ్రమేనని ఆయన గుర్తు చేశారు. ఎంఎస్ఎంఈలను కాపాడుకోకపోతే నిరుద్యోగం బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

గత ప్రభుత్వం పరిశ్రమలకు బకాయిపడ్డన నిధులను కూడ క్లియర్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.  పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పించేలా ప్రయత్నిస్తామన్నారు. తక్కువ వడ్డీకే రూ. 2 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు రుణాలను ఇప్పిస్తామని సీఎం వివరించారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ. 20 లక్షల కోట్ల ఆర్దిక ప్యాకేజీని ప్రకటించింది.ఇందులో ఎంఎస్ఎంఈలకు కూడ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.పలు రంగాలకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios