బిటెక్ రవికి షాక్: గన్ మెన్ల తొలగింపు
మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బిటెక్ రవి గన్ మెన్లను ప్రభుత్వం తొలగించింది. బిటెక్ రవి గన్ మెన్లను వెనక్కు రావాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.
కడప: మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బిటెక్ రవి గన్ మెన్లను ప్రభుత్వం తొలగించింది. బిటెక్ రవి వద్ద ఉన్న ఇద్దరు గన్ మెన్లను వెనక్కు రావాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నుండి గన్ మెన్లకు సమాచారం అందింది.
ఈ ఏడాది మార్చి29వ తేదీతో బిటెక్ రవి ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసింది. తనకు గన్ మెన్లను తొలగించడంపై న్యాయపోరాటం చేస్తానని బిటెక్ రవి ప్రకటించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 2+2 గన్ మెన్లు ఉండేవారు. చంద్రబాబు సర్కార్ గద్దెదిగి జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1+1 గన్ మెన్లను కుదించింది పోలీస్ శాఖ. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి బిటెక్ రవి ఇంచార్జీగా ఉన్నారు.
also read:వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా: సీబీఐకి హైకోర్టు సూచనలు
2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిపై బిటెక్ రవి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీటెక్ రవి విజయం సాధించడంపై వైఎస్ వివేకానందరెడ్డి పార్టీలోని కొందరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం కూడా లేకపోలేదు . వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలు వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వివేకా హత్య కేసులో 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి అంశాన్ని కూడా సీబీఐ ప్రస్తావిస్తుంది.