జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి వాటిపై నిషేధం
వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం విధించినట్లు వెల్లడించింది. డిసెంబర్ 7 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ.. కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై నిషేధం విధించినట్లు వెల్లడించింది ఆ రాష్ట్రప్రభుత్వం (Andhra Pradesh government). డిసెంబర్ 7 నుంచి ఈ నిషేధ ఉత్తర్వులు అమల్లోకి వస్తుందని తెలిపింది.
నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నిటిపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని వేరే పేరుతో తయారు చేయడం, అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డ, ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
Read Also: https://telugu.asianetnews.com/video/andhra-pradesh/ap-governmentt-employees-wear-black-badges-to-work-in-protest-r3qmr4
ఏపీతోపాటు.. తెలంగాణలోనూ గుట్కా, పాన్ మసాలాలపై ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో గుట్కా నిషేధాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 160 పిటిషన్లు దాఖలు కాగా.. వీటన్నింటిని కొట్టివేస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పొగాకుతో తయారు చేసే ఖైనీ, గుట్కా, సుగంధ పరిమళ పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తూ రాష్ట్రం ఇచ్చిన ఉత్తర్వులు చట్ట ప్రకారమే ఉన్నాయని హైకోర్టు తీర్పు చెప్పింది. అలాగే.. పౌడర్, టూత్‌పేస్ట్‌లో పొగాకు వినియోగాన్ని కూడా నిషేధించింది. కరోనా కంటే గుట్కా వల్లే ఎక్కువమంది మరణిస్తున్నారని ధర్మాసనం పిటిషనర్లపై సీరియస్ అయ్యింది.
Read Also: https://telugu.asianetnews.com/andhra-pradesh/ap-bjp-chief-somu-veerraju-sensational-comments-r3qlc9
మరోవైపు.. ఏపీ సర్కార్ మద్యం నిషేధాన్ని కూడా సంపూర్ణంగా చేయాలని అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం నిషేధం పేరు చెప్పి వైన్ షాపులను (Wine shops) తగ్గించేసింది జగన్ సర్కార్. రేట్లు పెంచితే మందు తాగే వారి సంఖ్య తగ్గుతుందనే ఆలోచనతో బారీగా మద్యం రేట్లను పెంచింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే చెత్త చెత్త బ్రాండ్లను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నా.. ఏ మాత్రం లెక్క చేయడం లేదు ఏపీ సర్కార్. ఆ విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. ఎప్పటికప్పడూ మందుబాబులకు షాక్ ఇస్తూనే .. మద్యంపై పన్ను రేట్లు సవరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేస్తూ వస్తుంది
ఇప్పటికే రాష్ట్రంలో చెత్త బ్రాండ్లను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గుట్కా రాయులపై ఇలా విరుచక పడటమేంటీ.. వారికి షాక్ ఇచ్చేలా నిషేధం విధించడమేంటని ఫీల్ అవుతున్నారు.