Asianet News TeluguAsianet News Telugu

ఆ తర్వాత.. రాజ‌కీయాల‌కు దూరం.. సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు (AP BJP Chief Somu Veerraju) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరమ‌వుతున‌ని ప్ర‌క‌టించారు. తనకు పదవుల మీద  ఆశలేదని, తాను  42 ఏళ్ల పాటు రాజ‌కీయ వ్యవస్థలో ఉన్నానని తెలిపారు. 2024లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరముందని, బీజేపీకి మాత్ర‌మే ఏపీని పాలించే సత్తా ఉందన్నారు.
 

AP BJP Chief Somu Veerraju Sensational Comments
Author
Hyderabad, First Published Dec 7, 2021, 2:08 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ రాష్ట్ర‌ అధ్యక్షుడు సోము వీర్రాజు ((AP BJP Chief Somu Veerraju) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న బీజేపీ భవిష్యత్ కార్యాచరణను వివ‌రించారు. జ‌గ‌న్ స‌ర్కార్ ప‌నితీరును విమర్శిస్తూనే.. త‌న రాజకీయ భ‌విష‌త్య్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత తాను రాజ‌కీయాల్లో ఉండ‌న‌నీ, ఆ తరువాత  రాజకీయాలకు గుడ్ బై చెప్ప‌న‌ని వీర్రాజు ప్ర‌క‌ట‌న చేశారు. తనకు పదవుల మీద ఆశలేదని, 42 ఏళ్లుగా ఈ వ్యవస్థలో ఉన్నానని తెలిపారు.

2024లో రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవ‌స‌ర‌మెంతైనా ఉంద‌నీ, ఏపీని ప‌రిపాలించే స‌త్తా బీజేపీకే ఉంద‌నీ, ఈ సారి బీజేపీకి అధికారం ఇవ్వాలన్నారు సోము వీర్రాజు. తనకేం సీఎం అవ్వాలన్న కోరిక లేదన్నారు.  గతంలో పదవులు పొందే అవకాశం వచ్చినా తాను తిరస్కరించానని 
జ్ఞాప‌కం చేశారు. 

Read Also: https://telugu.asianetnews.com/andhra-pradesh/arguments-in-jagan-plea-for-exemption-from-cbi-court-appearance-r3qaps

రాష్ట్రానికి బీజేపీ స‌ర్కార్.. వేల కోట్ల నిధులు అందించింద‌నీ, ఇప్ప‌టి వ‌ర‌కూ పోలవరం ప్రాజెక్టుకు రూ. 11వేల కోట్లు ఇచ్చామ‌ని, మరో రూ.700 కోట్లు ఇవ్వానున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో మిగితా నిధుల‌ను కూడా విడుదల చేస్తోందనీ, ప్రాజెక్ట్ కట్టిన లెక్కల ప్రకారం నిధులను విడుదల చేస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. 

వేల కోట్ల నిధులు విడుద‌ల చేసినా..  జ‌గ‌న్ స‌ర్కార్ అసత్య ప్ర‌చారం చేస్తోంద‌నీ, పోలవరానికి కేంద్రం నిధులివ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హంవ్య‌క్తం చేస్తోంది. గతంలో అంచనాలు పెంచేశారని చంద్రబాబు పై విమర్శలు చేసిన సీఎం జగన్.. ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారని ప్ర‌శ్నించారు.

Read Also: https://telugu.asianetnews.com/andhra-pradesh/tdp-leader-kala-venkatrao-satires-on-cm-ys-jagan-on-three-capitals-issue-r3qhej

పోల‌వ‌రం క‌ట్టే స‌త్తాలేకపోతే.. జ‌గ‌న్ స‌ర్కార్ లేక‌పోతే.. కేంద్రానికి అప్పగించాల‌నీ, తామే నిర్మిస్తామన్నారు  అలాగే.. అన్నమయ్య ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి ప్రస్తావిస్తే.. షెకావత్‌ను త‌ప్పు ప‌డుతారా అని ప్ర‌శ్నించారు. ఏపీలో జరుగుతున్న విషయాలు ఆయ‌న‌కు తెలువ‌వు అనుకుంటే తప్పన్నారు. జరిగిన పొరపాటును సరిదిద్దుకోకుండా విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. పార్ల‌మెంట్ లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్.. వైసీపీ వైఫల్యాలను కడిగేశారని, వైసీపీ మంత్రుల‌కు క‌నీస జ్ఞానం లేద‌నీ, అదే కేంద్ర మంత్రి ఏపీకి వస్తే వైసీపీ మంత్రులు, కార్యకర్తలే తిరుపతి ప్రసాదాలు ఇస్తున్న సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు. 

జ‌గ‌న్ పాల‌న‌లో అవినీతి ఎక్కువైంద‌ని, అభివృద్ది పేరిట .. అప్పుల రాష్ట్రంగా మార్చుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గతంలో తనకు చంద్రబాబు అనేక సార్లు మంత్రి పదవి ఇస్తానన్న పిలిచినా..  ఎలాంటి ప‌ద‌వి తీసుకోలేద‌ని, త‌న‌కు ప‌ద‌వుల మీద వ్యామోహం లేద‌ని అన్నారు. అలాగే 2024 తర్వాత తాను రాజకీయాల్లో ఉండబోన‌ని, త‌నకు 42 యేండ్ల రాజ‌కీయ ప్ర‌స్థానం ఉందనీ, ఏపీలో బీజేపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.. తాను పదవులు ఆశించి పని చేయలేదని.. తనకు సీఎం అవ్వాలని లేదన్నారు. తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Follow Us:
Download App:
  • android
  • ios