ఏపీ శాసనమండలి రద్దైతే ఆ ఇద్దరు మంత్రులకు ఎసరు
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు అసెంబ్లీలో శాసనమండలిని రద్దు చేసే తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేసేందుకు ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. అసెంబ్లీలో ఇవాళ ఉదయం 11 గంటలకు శాసనమండలి రద్దుపై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
శాసనమండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంట్ కు పంపనున్నారు. పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. శాసన మండలి రద్దు కంటే ముందు ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం.
వైఎస్ జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణలు శాసనమండలి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రేపల్లే నుండి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యాడు. పిల్లి సుభాష్ చంద్రబోస్ లు శాసనమండలిలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరికి జగన్ తన కేబినెట్ లో చోటు కల్పించారు.
శాసనమండలిని రద్దు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.శాసనమండలి రద్దైతే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు తమ మంత్రి పదవులను కోల్పోవాల్సి వస్తోంది.
సోమవారం నాడు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో శాసనమండలి రద్దు తీర్మానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఉదయం పదకొండు గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది.ఈ సభలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
Also read:సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో తొలి అడుగు: పేర్లు ఇవ్వాలని పార్టీలకు షరీఫ్ లేఖ
శాసనమండలిని రద్దు చేసే ప్రకటనకు ముందే శాసనమండలి నుండి జగన్ కేబినెట్ లో ఉన్న ఇద్దరు మంత్రులు కూడ తమ పదవులకు రాజీనామాలు చేయాలనే యోచనలో ఉన్నారని సమాచారం. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
శాసనమండలిని రద్దు చేసే దిశగానే ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది.ఈ మేరకు సోమవారం నాడు నిర్వహించే సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ నిర్వహించే సభకు టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొంది.