వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే భ్రమల్లో టీడీపీ: మోడీతో బాబు భేటీ పై సజ్జల సెటైర్లు

వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే భ్రమల్లో టీడీపీ ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. టీడీపీ వెంటిలేటర్ పై ఉందన్నారు. 

AP Government Advisor Sajjala Ramakrishna Reddy Satirical Comments on Chandrababu

అమరావతి: వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే భ్రమల్లో TDP  ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy  చెప్పారు.సోమవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  టీడీపీ వెంటిలేటర్ పై ఉందన్నారు.  Chandrababu Naidu ను ఎప్పుడైనా రావొచ్చు, ఇది మీ ఇల్లే అనుకోవచ్చు అని Narendra Modi చంద్రబాబుతో అన్నారని  కొన్ని పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యలను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. 

వచ్చే ఎన్నికల్లో BJP కి తెలంగాణలో చంద్రబాబు, Pawan Kalyan  ఓటు బ్యాంకు ఉపయోగపడేలా చేస్తారనే విశ్లేషణలున్నాయన్నారు. Andhra Pradesh లో తమకు ఏమైనా అవకాశాలు కల్పించాలని బీజేపీని టీడీపీ ప్రయత్నం చేస్తుందనే అనుమానం వ్యక్తం చేశారు.

టీడీపీ వెంటిలేటర్ పై ఉందన్నారు. ప్రతి ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీ చతికిలపడిందన్నారు.వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని టీడీపీ పగటి కలలు కంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు  ఏదేదో ప్రచారం చేస్తున్నారన్నారు.ప్రధానమంత్రి మోడీయే చంద్రబాబును పిలిచినట్టుగా కలరింగ్ ఇస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఊతకర్ర  కోసం చూస్తున్నారని చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో బీజేపీ సహకారం కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు.ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులుండవని ఆయన చెప్పారు.  

2018లో చంద్రబాబు కారణంగా Telanganaలో Rahul Gandhi కి ఏమైందని ఆయన ప్రశ్నించారు. 2018లో తెలంగాణలో టీడీపీ ఘోర పరాజయం పొందిందన్నారు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ పలితాలు ఏనాడూ రాలేదన్నారు 2019లో Andhra Pradesh లో కూడా టీడీపీ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుందన్నారు. చంద్రబాబునాయుడు  చెప్పుకోవడానికి ఏముందని ప్రశ్నించారు. YCP  సర్కార్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని పురోభివృద్ది దిశగా పయనింపజేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు. తమ సర్కార్ ఏం చేస్తుందో ప్రజలకు తెలుసునన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను  వైసీపీ సర్కార్ అమలు చేస్తుందన్నారు. 

గత వారంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లాడు.కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబుతో మోడీ కొద్దిసేపు మాట్లాడారు. ఈ విషయమై  సజ్జల రామకృష్ణారెడ్డి  మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించారు. 

ఎన్డీఏతో టీడీపీ తెగతెంపులు చేసుకున్న తర్వాత మోడీతో చంద్రబాబు కలవడం ఇదే తొలిసారి.  ఎన్డీఏతో టీడీపీ తెగదెంపులు చేసుకొనే సమయంలో బీజేపీపై, మోడీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. మోడీ సర్కార్ పై అవిశ్వాసం కూడా ప్రతిపాదించారు. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. వైసీపీ ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా మోడీ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios