ఏపీలో టీఆర్ఎస్ ఏర్పాటును ఎవరైనా వద్దన్నారా?: సజ్జల
ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ ఏర్పాటు చేస్తానంటే ఎవరైనా అడ్డుకొన్నారా అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. శ్రీశైలం నుండి నీటిని వినియోగించుకోవడం వల్లే తెలంగాణలో విద్యుత్ కష్టాలు లేవన్నారు.
అమరావతి: ఏపీలో Trs పార్టీని ఏర్పాటు పెడతానంటే ఎవరైనా వద్దన్నారా అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీఆర్ఎష్ పార్టీని పెట్టొద్దని ఎవరూ కూడా అడ్డు చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. రాజకీయ పార్టీని ఎవరైనా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. దీనికి ఎవరి అనుమతులు కూడా అవసరం లేదన్నారు. పార్టీ ఏర్పాటే కాదు ఎక్కడైనా కూడ ఎవరైనా పోటీ చేయవచ్చని Sajjala Ramakrishna Reddy తెలిపారు.
also read:సజ్జలరామకృష్ణారెడ్డి గుమాస్తాకు తక్కువ, జీతగాడికి ఎక్కువ... కొమ్మారెడ్డి
శ్రీశైలం ప్రాజెక్టు నుండి అడ్డగోలుగా నీటిని వాడడం వల్లే తెలంగాణలో విద్యుత్ కష్టాలు లేవన్నారు. hyderabad లేకుండా ఏపీని విభజించడం వల్లే ఏపీకి ఇబ్బంది ఉంటుందని తాము ముందే చెప్పామన్నారు. ఏపీలో అంధకారం అలుముకుంటుందని, నీటి సమస్యలు కూడా వస్తాయని ముందే చెప్పామని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
రాష్ట్రంలో డ్రామా క్రియేట్ చేయడంలో టీడీపీ అధినేత Chandrababu సిద్ధహస్తులన్నారు.చంద్రబాబు బూతు డ్రామా వర్కవుట్ కాలేదన్నారు.. తనకు Amith shah ఫోన్ చేసినట్లు చంద్రబాబు కలరింగ్ ఇచ్చారని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.. ఢిల్లీ స్థాయిలో ఏపీ పరువు తీశారని చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
తనకు ఓటు వేయని ప్రజలపై చంద్రబాబు పగ తీర్చుకుంటున్నారని అన్నారు. ఢిల్లీ స్థాయిలో ఏపీ పరువు తీసేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని అన్నారు.తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలన దృష్టి మరల్చేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. అబద్ధాలు, వంచన, డ్రామా బాబుకు తెలిసిన ఏకైక విద్య అని సజ్జల మండిపడ్డారు.
ఏపీ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ ను ఏర్పాటు చేయాలని Trs ప్లీనరీ సమావేశంలో Kcr వ్యాఖ్యానించారు. దళితబంధును అమలు చేసిన తర్వాత ఈ వినతులు మరింత ఎక్కువయ్యాయని కేసీఆర్ చెప్పారు.ఈ వ్యాఖ్యలపైనే సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.ఈ సమావేశంలో తెలంగాణ ఏర్పాటైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం అంధకారమౌతోందని సమైఖ్య పాలకులు భయపెట్టారన్నారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు లేవన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కరెంట్ కష్టాలున్నాయన్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇటీవల కాలంలో గ్యాప్ వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల విషయంలో ఇద్దరు సీఎంలు కూడ తమ తమ రాష్ట్రాల తమ వాదనలను వినిపిస్తూ కేంద్రానికి ఫిర్యాదులు చేసుకొన్నాయి.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇటీవల కాలంలో గ్యాప్ వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల విషయంలో ఇద్దరు సీఎంలు కూడ తమ తమ రాష్ట్రాల తమ వాదనలను వినిపిస్తూ కేంద్రానికి ఫిర్యాదులు చేసుకొన్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకొస్తూ గెజిట్ విడుదల చేసింది.ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకు రావడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ముందుగా ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం ఈఎప్సీ మురళీధర్ రావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ నిర్ణయం మేరకు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది.