ప్రచారం కోసమే ముంపు గ్రామాల్లో బాబు టూర్: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

వరద ముంపు గ్రామాల్లో చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

AP Government Advisor Sajjala Ramakrishna Reddy Comments on Chandrababunaidu

అమరావతి:  వరద ముంపు గ్రామాల్లో చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 

శుక్రవారం నాడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy  మీడియాతో మాట్లాడారు. Godavari  వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన పేరుతో Chandrababu వరద సాయంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అంతేకాదు వరదతో వచ్చిన ముంపును కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆయన  మండిపడ్డారు. వరద ముంపు గ్రామాల్లో చంద్రబాబునాయుడు ప్రచారం కోసమే పర్యటనలు చేస్తున్నారని సజజల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో వర్షాలు సరిగా పడవని ఆయన చెప్పారు.  Media లో ప్రచారం కోసం చంద్రబాబు చేసిన ఆర్భాటం వల్లే గోదావరి పుష్కరాల సమయంలో గతంలో 13 మంది మరణించారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 

ముంపు గ్రామాల్లో బురద నీటిని బాటిల్ లో నింపుకొని ప్రభుత్వం ఈ తరహా నీటిని అందిస్తుందని చంద్రబాబు విమర్శలను సజ్జల రామకృష్ణారెడ్డి తప్పు బట్టారు. ఈ విషయమై ఏం జరిగిందో ఓ మహిళ చెప్పిన అంశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో ప్రదర్శించారు.  అంతేకాదు వరద ప్రభావిత ప్రాంతాల్లో బోటులో ప్రయాణం చేసే సమయంలో చంద్రబాబు మీడియాలో ప్రచారం కోసం ఏ రకంగా ప్రయత్నాలు చేశారో కూడా మరో వీడియోను ప్రదర్శించారు. ఈ రెండు వీడియోలను చూస్తే చంద్రబాబు ఏ రకంగా ప్రచారం కోసం ప్రయత్నాలు చేస్తారో అర్ధం అవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు..

also read:చంద్రబాబు టూర్ లో అపశృతి: వరద నీటిలో పడిన మాజీ మంత్రులు, టీడీపీ నేతలు (వీడిియో)

వరద ముంపు గ్రామాల్లో చంద్రబాబునాయుడు రెండు రోజులుగా పర్యటిస్తున్నారు.  నిన్న పశ్చిమగోదావరి జిల్లాలోని సోంపల్లి వద్ద బోటు దిగుతున్న సమయంలో గోదావరిలో బోటు బోల్తా పడిన ఘటనలో పలువురు టీడీపీ నేతలు,మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గోదావరి నదిలో పడిపోయారు. అయితే గోదావరి నదిలో వరద ఉధృతి తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంతేకాదు నేతలను స్థానికలు, గన్ మెన్లు, మత్స్యకారులు వెంటనే రక్షించారు.  ఈ ఘటనకు ముందే చంద్రబాబునాయుడు సురక్షితంగా ఓడ్డుకు చేరుకొన్నారు. చంద్రబాబు తర్వాత బోటులో ఒడ్డుకు వచ్చే క్రమంలో నేతలు ఒక్కసారిగా బోటులో ఒకే వైపునకు రావడంతో ఈ ఘటన చోటు చేసుకొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios