చంద్రబాబు టూర్ లో అపశృతి: వరద నీటిలో పడిన మాజీ మంత్రులు, టీడీపీ నేతలు (వీడిియో)


పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన సమయంలో  ప్రమాదం తప్పింది. బోటు నీటిలో పడడంతో పలువురు మాజీ మంత్రులు, టీడీపీ నేతలు  నీటిలో పడ్డారు.  

  TDP leaders Safely escaped from boat accident in West godavari Distirct


ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పర్యటనలో గురువారం నాడు ప్రమాదం తప్పింది.  వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సమయంలో  బోటు బోల్తా పడింది.. ఈ ఘటనలో మాజీ మంత్రులు, టీడీపీ నేతలు  నీటిలో పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

చంద్రబాబు పర్యటనలో భాగంగా టీడీపీ నేతలు ప్రయాణించిన పడవ ఒడ్డుకు చేరుకుంది. ఆ సమయంలో బోటు దిగే సమయంలో బోటు ఒక్కసారిగే ఒకేవైపునకు ఒరిగిపోయింది. ఈ ఘటనలో ఈ బోటులో ఉన్న మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు గోదావరి వరద నీటిలో పడిపోయారు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే లైఫ్ జాకెట్లను విసిరేశారు. అంతేకాదు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గన్ మెన్లు కూడా నీటిలో పడిన ప్రజా ప్రతినిధులను రక్షించారు. ఓటు నడిపే వారితో పాటు స్థానికంగా ఉన్నవారు నీటిలో పడినవారిని రక్షించారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, పితాని సత్యనారాయణ, రాధాకృష్ణ, రామ్మోహన్, రామరాజులు వరద నీటిలో పడిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికలు వారిని రక్షించారు.

మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, పితాని సత్యనారాయణ, రాధాకృష్ణ, రామ్మోహన్, రామరాజులు వరద నీటిలో పడిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం సోంపల్లికి టీడీపీ నేతలు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత చంద్రబాబునాయుడు ప్రయాణిస్తున్న పంటు ఒడ్డుకు చేరుకొంది. ఆ తర్వాత , మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలున్న బోటు  ఇక్కడికి చేరింది. 

తొలుత రాజోలు మండలం చాకలిపాలెం వద్దకు పంటు వచ్చే మార్గం లేకపోవడంతో సోంపల్లికి రూట్ మార్చాల్సి వచ్చిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. సోంపల్లికి చంద్రబాబునాయుడు పంటుపై వచ్చారు.  అయోధ్యలంక నుండి వచ్చే సమయంలో చంద్రబాబుఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది  ఇచ్చిన లైఫ్ జాకెట్ ను ధరించారు.  కానీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం లైఫ్ జాకెట్లు ధరించకుండానే బోట్ లో ప్రయాణం చేశారు.  బోటు నుండి టీడీపీ నేతలు నీటిలో పడిన ప్రాంతంలో గోదావరి కేవలం మూడు నుండి నాలుగు అడుగుల మేర మాత్రమే ప్రవహిస్తుంది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టైంది. బోటు తిరగబడిన సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు, ప్రజా ప్రతినిధుల గన్ మెన్లు స్పందించి  వారిని రక్షించారు. 

పడవల ద్వారా ఒడ్డుకు చేరే క్రమంలో  పడవలు ఒక వైపునకు ఒరిగిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకొంది. పంటు నుండి చంద్రబాబు మొదట బోటులో ఒడ్డుకు చేరుకున్నారు. చంద్రబాబునాయుడు. ఆ తర్వాత మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, నిమ్మకాయల చిన రాజప్ప, పితాని సత్యానారాయణ తదితరులు పంటు నుండి  బోటును ఎక్కే సమయంలో  రెయిలింగ్ విరిగిపోవడంతో నేతలు గోదావరి వరద నీటిలో పడిపోయారు.సోంపల్లికి సమీపంలో గల మానేపల్లి వద్ద వరద బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు  సహా టీడీపీ నేతలు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ఘటనతో ఈ ప్రాంతంలో టీడీపీ నేతలు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios