బిజినెస్ రిఫార్మ్ యాక్షన్‌ప్లాన్ ఇంప్లిమెంటేషన్‌లో వందశాతం స్కోరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ర్యాంకు లభించింది. నీతిఆయోగ్ సూచికల్లో ఏపీ పలు ర్యాంకులను నమోదుచేసుకుంది. వాటి వివరాలు ఈ  విధంగా ఉన్నాయి. అగ్రికల్చరల్ మార్కెటింగ్-ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్ ఇండెక్స్-2016లో 56.2 స్కోరుతో ఏపీకి 7వ ర్యాంకు లభించింది. అలాగే పెర్ఫామెన్స్ ఆన్ హెల్త్ అవుట్ కమ్ ఇండెక్స్-2016లో ఏపీకి 10వ ర్యాంకు, హెల్త్ ఇండెక్స్ 2018లో 60.16 స్కోరుతో 8వ ర్యాంకు లభించింది. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్-2016లో 56 శాతం స్కోరుతో 17వ ర్యాంకు దక్కింది. అంతేగాక గ్రామీణ మౌలిక సదుపాయాల్లో సాధించిన ప్రగతి ఈ విధంగా ఉంది. అర్హత గల అన్ని కుటుంబాలకు నూరుశాతం ఎల్‌పీజీ కనెక్షన్ల అందజేత, రాష్ట్రంలో ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, గ్రామీణ ప్రాంతాలలో నూరుశాతం ఓడీఎఫ్ అమలు, 80 శాతం శివారు గ్రామాలన్నీ రహదారులకు అనుసంధానం, 30,500 కి.మీ మేర గ్రామాలలో అంతర్గత సిమెంట్‌రోడ్ల నిర్మాణం జరిగినట్లు గుర్తించారు.