అమరావతి: ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మంగళవారం నాడు మంగళవారం నాడు పమిడిముక్కల పోలిస్ స్టేషన్ నుండి విడుదలయ్యారు.ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం నాడు గొల్లపూడి సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహాం వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్షకు ప్రయత్నించారు. దీక్షకు ప్రయత్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు.

also read:నీ ఇంటికే వస్తా, తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం: దేవినేనికి వల్లభనేని కౌంటర్

కృష్ణా జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను తిప్పుతూ  చివరికి పమిడి ముక్కల పోలీస్ స్టేషన్ కు తరలించారు. పమిడిముక్కల పోలీస్ స్టేషన్  వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.

జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే  శ్రీరాం తాతయ్య సహా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.  టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు రాకుండా పోలీసులు  అడ్డుకొన్నారు. రోడ్డుపై వాహనాన్ని అడ్డుపెట్టి పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుపడ్డారు.మంగళవారం నాడు సాయంత్రం మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు.