అమరావతి: ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీమంత్రి అచ్చెన్నాయుడు తన భద్రత కుదింపుపై అసహనం వ్యక్తం చేశారు. విధులకు హాజరయ్యేందుకు వచ్చిన గన్ మెన్ ను తిప్పి పంపించి వేశారు. తనకు గన్ మెన్ అవసరం లేదంటూ రుసరుసలాడారు.

అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం 4 ప్లస్ 4 గన్ మెన్ సౌకర్యం కల్పించింది. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలకు భద్రతను కుదిస్తూ భద్రతా సమీక్షా కమిటీ నిర్ణయం తీసుకుంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో అచ్చెన్నాయుడుకు 4 ప్లస్ 4  గన్ మెన్ సౌకర్యం తగ్గించి 2 ప్లస్ 2కు కుదించింది. అందులో భాగంగా గురువారం ఉదయం ఒక గన్ మెన్ మాత్రమే రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గన్ మెన్ ను తిప్పి పంపించి వేశారు.