Asianet News TeluguAsianet News Telugu

జవానుతో లింక్స్ : పరిటాల సునీత కుమారుడి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

పరిటాల సిద్ధార్థ వ్యక్తిగత కారణాల నేపథ్యంలో కొన్నేళ్లక్రితం అనంతపురం కలెక్టర్ నుంచి అయిదు లైసెన్స్ తీసుకుని .32 క్యాలిబర్ పిస్టల్ కొన్నారు.  దాని కాలపరిమితి 2019తో ముగియడం, అదే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఎన్నికలకు ముందే.. తన ఆయుధాన్ని రామగిరి పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేశారు.

AP ex-minister TDP leader Parital Sunita son Siddharth has illegal weapons?
Author
Hyderabad, First Published Aug 21, 2021, 12:48 PM IST

ఏపీ మాజీమంత్రి టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధాలు ఉందా?  తాజా పరిణామాలను పరిశీలిస్తుంటే ఈ అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో అతను లైసెన్స్ తీసుకున్నఆయుధానికి, బుధవారం శంషాబాద్ విమానాశ్రయంలో అతని బ్యాగ్ నుంచి స్వాధీనం చేసుకున్న బుల్లెట్ కు పొంతన లేకపోవడంతో ఈ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు  దర్యాప్తు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పరిటాల సిద్ధార్థ వ్యక్తిగత కారణాల నేపథ్యంలో కొన్నేళ్లక్రితం అనంతపురం కలెక్టర్ నుంచి అయిదు లైసెన్స్ తీసుకుని .32 క్యాలిబర్ పిస్టల్ కొన్నారు.  దాని కాలపరిమితి 2019తో ముగియడం, అదే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఎన్నికలకు ముందే.. తన ఆయుధాన్ని రామగిరి పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేశారు.  అయితే బుధవారం తెల్లవారుజామున ఆయన బ్యాగేజీలో లభించినవి 5.56 క్యాలిబర్ తూటాలు.

ఇవి కేవలం సాయుధ బలగాలు మాత్రమే వాడే ఇన్సాస్ రైఫిల్ కు సంబంధించినవి అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ వద్ద 5.56 కి చెందిన అక్రమ ఆయుధం ఉందా? అనుమానాలు కలుగుతున్నాయి.  అయితే ఈ వ్యవహారంలో శంషాబాద్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా నిషేధిత తుపాకీ తూటాలు కలిగి ఉన్న వ్యక్తులను పోలీసులు నిందితులుగా భావించి విడిచిపెట్టరు. అయితే సిద్ధార్థ్ ను మాత్రం వివరణ కోరుతూ సీఆర్పీసీ 41-ఏ కింద నోటీసులు జారీ చేసి వదిలేయడం గమనార్హం.

సిద్ధార్థ వద్ద లభించిన తూటాకు, ఈ ఏడాది ఏప్రిల్లో అస్సాంలోని బాగ్ డోగ్రా విమానాశ్రయంలో ఓ ఐటీబీపీ కానిస్టేబుల్ వద్ద లభించిన తూటాలకు లింకులు ఉన్నాయా?  అనే అనుమానాలు కలుగుతున్నాయి.  అస్సాం లో పనిచేసే అనంతపురం జిల్లా ములకనూరుకు చెందిన ఓ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ కానిస్టేబుల్ ఏప్రిల్ 17న  బెంగళూరు వెళ్లేందుకు బాగ్ డోగ్రా విమానాశ్రయానికి రాగా  ఆయన బ్యాగేజీలో 5.56 క్యాలిబర్ కు చెందిన 100 పేల్చని తూటాలు లభ్యమయ్యాయి. 

దీని మీద పోలీసులు కేసు నమోదు చేయగా ఐటీబీపీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికితోడు ఆ కానిస్టేబుల్ కు పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పరిటాల సునీత కుమారుడిపై కేసు..

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ్ మీద శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రత నిబంధలకు విరుద్ధంగా బ్యాగ్ లో బుల్లెట్ తో విమానం ఎక్కడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఆయన మద ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు.

తెలుగుదేశం పార్టీలో యువనాయకుడిగా ఉన్న సిద్ధార్థ్ బుధవారం ఉదయం తన కుటుంబసభ్యులతో శ్రీనగర్ వెళ్లడానికి ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఉదయం 5.26ని.లకు ఇండిగో విమానం ఎక్కడానికి వచ్చిన ఆయన తన బ్యాగేజ్ ను కౌంటర్ లో అప్పగించారు. విమానాశ్రయ అధికారులు బ్యాగ్ ను స్కానింగ్ చేశారు. 

ఈ నేపథ్యంలో అందులో 5.56 ఎంఎం క్యాలిబర్ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేసిన హోల్డ్ బ్యాగేజ్ స్క్రీనింగ్ ఇంఛార్జ్ ఎ.సన్యాసినాయుడు బుల్లెట్ తో పాటు సిద్ధార్థ్ ను వారికి అప్పగించారు. పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో తనకు అనంతపురంలో లైసెన్ట్స్ ఆయుధం ఉందని, ఇది దానికి సంబంధించిన బుల్లెట్ అని సిద్ధార్థ్ తెలిపారు. 

బ్యాగ్ లో బుల్లెట్ ఉందన్న విషయం తెలియక.. విమానం ఎక్కడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఆయనతో ఆయుధ లైసెన్సుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఆర్పీసీ 41-ఏ కింద నోటీసులు జారీ చేశారు. దీనిమీద మూడ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, ఆయుధ లైసెన్సుకు సంబంధించిన పూర్తి పత్రాలు అందించాలని ఆదేశించి పంపేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios