Asianet News TeluguAsianet News Telugu

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పరిటాల సునీత కుమారుడిపై కేసు..

తెలుగుదేశం పార్టీలో యువనాయకుడిగా ఉన్న సిద్ధార్థ్ బుధవారం ఉదయం తన కుటుంబసభ్యులతో శ్రీనగర్ వెళ్లడానికి ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఉదయం 5.26ని.లకు ఇండిగో విమానం ఎక్కడానికి వచ్చిన ఆయన తన బ్యాగేజ్ ను కౌంటర్ లో అప్పగించారు. విమానాశ్రయ అధికారులు బ్యాగ్ ను స్కానింగ్ చేశారు.

bullet found in ex minister paritala sunita son paritala siddarth luggage in shamshabad airport, hyderabad
Author
Hyderabad, First Published Aug 20, 2021, 11:37 AM IST

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ్ మీద శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రత నిబంధలకు విరుద్ధంగా బ్యాగ్ లో బుల్లెట్ తో విమానం ఎక్కడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఆయన మద ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు.

తెలుగుదేశం పార్టీలో యువనాయకుడిగా ఉన్న సిద్ధార్థ్ బుధవారం ఉదయం తన కుటుంబసభ్యులతో శ్రీనగర్ వెళ్లడానికి ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఉదయం 5.26ని.లకు ఇండిగో విమానం ఎక్కడానికి వచ్చిన ఆయన తన బ్యాగేజ్ ను కౌంటర్ లో అప్పగించారు. విమానాశ్రయ అధికారులు బ్యాగ్ ను స్కానింగ్ చేశారు. 

ఈ నేపథ్యంలో అందులో 5.56 ఎంఎం క్యాలిబర్ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేసిన హోల్డ్ బ్యాగేజ్ స్క్రీనింగ్ ఇంఛార్జ్ ఎ.సన్యాసినాయుడు బుల్లెట్ తో పాటు సిద్ధార్థ్ ను వారికి అప్పగించారు. పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో తనకు అనంతపురంలో లైసెన్ట్స్ ఆయుధం ఉందని, ఇది దానికి సంబంధించిన బుల్లెట్ అని సిద్ధార్థ్ తెలిపారు. 

బ్యాగ్ లో బుల్లెట్ ఉందన్న విషయం తెలియక.. విమానం ఎక్కడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఆయనతో ఆయుధ లైసెన్సుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఆర్పీసీ 41-ఏ కింద నోటీసులు జారీ చేశారు. దీనిమీద మూడ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, ఆయుధ లైసెన్సుకు సంబంధించిన పూర్తి పత్రాలు అందించాలని ఆదేశించి పంపేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios