జగన్ రెడ్డీ... ఇకనైనా అవి తాట తీస్తాయని గుర్తుంచుకో..: చంద్రబాబు హెచ్చరిక

అప్రజాస్వామికంగా ఎన్ని చీకటి జీవోలు ఇచ్చినా చట్టం ముందు న్యాయానిదే గెలుపు అని మాన్సాన్ ట్రస్ట్ విషయంలో హైకోర్టు తీర్పు మరోసారి నిరూపించిందన్నారు టిడిపి చీఫ్ చంద్రబాబు. 

chandrababu warning to cm ys jagan akp

గుంటూరు: మాన్సాస్ ట్రస్టు విషయంలో ప్రభుత్వ చీకటి జీవోలను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తుగ్లక్ సీఎంకి చెంపపెట్టని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల ఆస్తుల్ని, వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలన్న జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనకు న్యాయం, చట్టం అడ్డుకట్ట వేయడం హర్షణీయం అన్నారు. అప్రజాస్వామికంగా ఎన్ని చీకటి జీవోలు ఇచ్చినా చట్టం ముందు న్యాయానిదే గెలుపు అని ఈ తీర్పు మరోసారి నిరూపించిందన్నారు.

''పూసపాటి వంశీకులు ఆదరించిన లక్షలాది మంది విద్యార్ధులు, వేలాది మంది ఉద్యోగులకు హైకోర్టు తీర్పు ఊపిరినిచ్చింది. వేతనాలివ్వకుండా పెడుతున్న అవస్థల నుండి స్వాంతన కల్పించింది. గజపతి రాజుల వంశ ప్రతిష్టకు మసిపూయాలనుకున్న ఏ-1 రెడ్డి దుర్మార్గాన్ని నిలువరించింది. అధికారం ఉందని అడ్డగోలు జీవోలిస్తే.. న్యాయం, చట్టం చూస్తూ ఉండవనడానికి నేటి తీర్పు నిదర్శనం'' అన్నారు. 

''అలుపెరుగక న్యాయ పోరాటంతో ట్రస్టును కాపాడుకోవడం అశోక్ గజపతిరాజు గారితో పాటు.. ట్రస్టు ద్వారా ఆదరింపబడుతున్న అందరి విజయం. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యం. సింహాద్రి అప్పన్న అండగా ఉన్నంత వరకు న్యాయం, ధర్మం, చట్టం ఏకమై జగన్ రెడ్డి తాట తీస్తాయని గుర్తుంచుకోవాలి'' అని హెచ్చరించారు.

read more  మాన్సాస్ ట్రస్ట్ పై హైకోర్ట్ తీర్పు... జగన్ సర్కార్ కు చెంపపెట్టు..: నారా లోకేష్

''దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కోర్టులతో ఇన్నిసార్లు తలంటించుకున్నది లేదు. కోర్టులిచ్చే తీర్పులతో అయినా.. జగన్ రెడ్డి మూర్ఖత్వం వీడాలి. అధికారులు గుడ్డిగా జీవోలివ్వడం మానుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను హరించేలా నిరంకుశ పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి ఈ తీర్పుతో నైనా కనువిప్పు కలగాలి'' అని చంద్రబాబు అన్నారు. 

ఇక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా హైకోర్టు తీర్పుపై ట్విట్టర్ వేదికన స్పందిస్తూ... ''మాన్సాస్ ట్ర‌స్ట్‌పై నిబంధ‌న‌ల‌న్నీ అడ్డగోలుగా అతిక్ర‌మించి ప్ర‌భుత్వం ఇచ్చిన అన్ని జీవోల‌ను హైకోర్టు ధ‌ర్మాస‌నం కొట్టేయ‌డం అంబేద్క‌ర్ రాజ్యాంగం విజ‌యం. చీక‌టి జీవోల ఏ1, ఏ2 రెడ్ల అరాచ‌కాల‌కు ఇక‌నైనా అడ్డుక‌ట్ట ప‌డాలి. మాట విన‌క‌పోతే ఏసీబీ, వైసీపీలో చేర‌క‌పోతే జేసీబీ, ప్ర‌జ్యావ్య‌తిరేక‌త విధానాలు ఎండ‌గ‌ట్టే ప్ర‌జాప్ర‌తినిదుల‌పైకి పీసీబీల్ని వాడుతోన్న మూర్ఖ‌పురెడ్డి...అర్ద‌రాత్రి అక్ర‌మ జీవోలిస్తూ చీకటిజీవోల రెడ్డి అయ్యాడు. పెద్ద‌లు పూస‌పాటి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు వైపు న్యాయం, ధ‌ర్మం ఉంది. ఏ కోర్టుకెళ్లినా రాజ్యాంగ‌విరుద్ధ‌మైన నీ చీక‌టి జీవోలు కొట్టివేత త‌ప్ప‌దు రెడ్డీ!'' అంటూ ఎద్దేవా చేశారు. 

 


 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios