సీపీఎస్ రద్దు: ఛలో విజయవాడ సెప్టెంబర్ 11కి వాయిదా

చలో విజయవాడ కార్యక్రమానికి సెప్టెంబర్ 1 తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్టుగా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీపీఎస్ ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. 

AP Employees Association Postponed Chalo Vijayawada on September 11

అమరావతి: సెప్టెంబర్ 1వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్టుగా ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.రాష్ట్రంలో ఇబ్బందికర వాతావరణం నెలకొన్న విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఛలో  విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు పిలుపునివ్వడంతో ఉద్యోగులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

 ప్రతి ఏటా సెప్టెంబర్ 1 వ తేదీన  సీపీఎస్ రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగ సంఘాలు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కూడ మద్దతును ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం సీపీఎస్ అంశంపై కసరత్తును ప్రారంభించింది. సీపీఎస్ కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్ విధానాన్ని అమలుచేసేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. 

ఈ మేరకు థర్ట్ పార్టీ ఏజెన్సీ ద్వారా అధ్యయనం ప్రారంభించింది ఏపీ సర్కార్. ఈ అధ్యయనం వివరాలను ఆర్ధిక శాఖ అధికారులకు వివరించనుంది ఏజెన్సీ. ఇవాళ ఏపీలో మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలకు ఈ ఎజేన్సీ వివరించింది.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios