అమరావతి: బలవంతంగా ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామ్ రెడ్డి  ఎస్ఈసీని కోరుతున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామ్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు.

also read:సిబ్బంది షాక్: పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్

కరోనా నేపథ్యంలో ఎన్నికల విధుల్లో ఉద్యోగులను బలవంతంగా తీసుకోవద్దని తాము కోరుతున్నామన్నారు.  అనారోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులను ఎన్నికలు విధులు చేయాలని బలవంత పెట్టవద్దని ఆయన కోరారు.

ఎన్నికల విధుల్లో  పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నవారిని తీసుకోవాలని ఆయన కోరారు.సుప్రీంకోర్టు ఏ రకమైన వ్యాఖ్యలు చేసిందో తనకు తెలియదన్నారు. సుప్రీంకోర్టు పూర్తి పాఠం వచ్చిన తర్వాత ఈ విషయమై వ్యాఖ్యానిస్తానని వెంకట్రామ్ రెడ్డి చెప్పారు.

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం ప్రకటించింది.  ప్రభుత్వ ఉద్యోగులు కూడ ఎన్నికల సంఘానికి సహాయ నిరాకరణ చేసింది.