Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో సమ్మెకు రెడీ అవుతున్న విద్యుత్ ఉద్యోగులు: రంగంలోకి బాలినేని

ఏపీ విద్యుత్ ఉద్యోగ సంఘాలతో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. సమ్మె నివారించేందుకు గాను ఆయన విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చలు జరుపుతున్నారు.

ap electric employees ready for strike
Author
Amaravathi, First Published Oct 28, 2020, 4:38 PM IST

ఏపీ విద్యుత్ ఉద్యోగ సంఘాలతో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. సమ్మె నివారించేందుకు గాను ఆయన విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చలు జరుపుతున్నారు.

14 అంశాలపై విద్యుత్ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అలాగే కేంద్రం ప్రతిపాదిస్తున్న ప్రైవేటీకరణ చేయబోమంటూ తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగులు కోరుతున్నారు.

అలాగే వీటీపీఎస్, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేసి బయట నుంచి కొనుగోళ్లు తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. నవంబర్ 16 తర్వాత సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు తేల్చి చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios