అమరావతి: ఏపీలో పంచాయితీ ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు వినతి పత్రం సమర్పించారు.

శుక్రవారం నాడు  సాయంత్రం ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి బృందం సీఎస్ తో భేటీ అయ్యారు.  కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. రెవిన్యూ, పంచాయితీరాజ్, ఉపాధ్యాయ సంఘాలతో పాటు  ఇతర అనుబంధసంఘాల నేతలు సీఎస్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

also read:గుంటూరు, చిత్తూరు కలెక్టర్లకు ఎస్ఈసీ షాక్: ఎన్నికల విధుల నుండి తప్పించాలని నిమ్మగడ్డ ఆదేశం

టీకాల పూర్తయ్యేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతోంది.అప్పటి వరకు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు.కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ విధులను పాల్గొంటున్నామని కేవలం టీకాల ప్రక్రియ పూర్తయ్యేవరకు మాత్రమే ఎన్నికల వాయిదాను కోరుతున్నట్టుగా ఉద్యోగ సంఘాల వినతిపత్రంలో కోరారు.

వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.