Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు, చిత్తూరు కలెక్టర్లకు ఎస్ఈసీ షాక్: ఎన్నికల విధుల నుండి తప్పించాలని నిమ్మగడ్డ ఆదేశం

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్  కీలక ఆదేశాలు జారీ చేసింది.  ఇద్దరు ఐఎఎస్‌లు, ఐపీఎస్ లను ఎన్నికల విదుల నుండి తప్పించాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.

AP SEC Nimmagadda Ramesh kumar orders to action chittoor, guntur collectors lns
Author
Guntur, First Published Jan 22, 2021, 5:37 PM IST


అమరావతి:ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్  కీలక ఆదేశాలు జారీ చేసింది.  ఇద్దరు ఐఎఎస్‌లు, ఐపీఎస్ లను ఎన్నికల విదుల నుండి తప్పించాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.గత ఏడాది మార్చిలో గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేయాలని  రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఇంత వరకు ఈ ఇద్దరిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయలేదు. 

వచ్చే నెలలో స్థానికసంస్థల ఎన్నికలను ఏపీ ఎస్ఈసీ నిర్వహించనుంది. ఈ మేరకు రేపు తొలి విడత నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ తరుణంలో ఈ ఇద్దరు కలెక్టర్లను ఎన్నికల విధుల నుండి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం కమిషనర్ లేఖ రాశారు.

also read:జగన్ తో భేటీ, నిమ్మగడ్డ సమావేశానికి డుమ్మా: అధికారులకు మెమో జారీ

 మరో వైపు తిరుపతి అర్బన్ ఎస్పీని ఎన్నికల విధుల నుండి తప్పించాలని కోరింది. అంతేకాదు చిత్తూరు జిల్లాలోని పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. వీరితో పాటు మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.పంచాయితీ ఎన్నికలు సజావుగా  నిర్వహించేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకొంటున్నట్టుగా ఎస్ఈసీ ప్రకటించింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios