విజయవాడ:ఆంధ్ర ప్రదేశ్ లో స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణపై కసరత్తు మొదలు పెట్టామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో ఇప్పటికే సమీక్షలు జరిపినట్లు తెలిపారు. అధికార యంత్రాంగమంతా ఎన్నికలకు సిద్దంగా వుందని... అతి త్వరలో షెడ్యూల్డ్ ను విడుదల చేస్తామని కమీషనర్ తెలిపారు. 

ప్రభుత్వ సిబ్బంది సరిపోతే కేవలం వారితోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా  పోలీస్ యంత్రాగాన్ని పూర్తిగా వాడుకుంటామని... భద్రతకు అవసరం ఐతే పక్క రాష్ట్రాల నుంచి బలగాలను తీసుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు.

read more ఆ ఉద్యోగులను స్థానికసంస్థల ఎన్నికలకు దూరంగా వుంచండి...: సీఈసీకి టిడిపి ఫిర్యాదు

అయితే రాష్ట్రం మొత్తంలో ఒకే దశలో  ఎన్నికలు జరపాలా....వివిధ దశల్లో జరపాలా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని... రేపటికి(శుక్రవారం) దీనిపై స్పష్టత వస్తుందన్నారు.  రేపు సాయంత్రం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. 

ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలోనే జరగనున్నాయని... ఇందుకోసం లక్ష బ్యాలెట్ బాక్స్ లు వాడనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వాటిని సమకూర్చుకున్నామని... అలాగే ఎన్నికల సామాగ్రిని కూడా సిద్దం చేసుకున్నట్లు వెల్లడించారు.  

రిజర్వేషన్ల ఖరారు తరువాత అందుకు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాతనే ప్రభుత్వ భవనాలకు రంగుల విషయం తన పరిధి లోకి వస్తుందన్నారు. అప్పుడే దీనిపై తనకు చర్యలు తీసుకునే  అధికారం వుంటుందన్నారు. 

 read more  ముప్పై మందితో మొదలై 16వేలకు... వారిపై ఎందుకంత కక్ష: సీఎంను నిలదీసిన మాాజీ మంత్రి

డబ్బు, మద్యం నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొత్త చట్టాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. అయితే ఈ చట్టం అమలు కూడా నిష్పక్షపాతంగా ఉండాలని... అప్పుడే దీనివల్ల లాభం వుంటుందని రమేష్ కుమార్ అన్నారు.