ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేస్ స్పష్టం చేశారు. కోవిడ్ ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం లేదని ఆయన తెలిపారు. 

ప్రతిపక్షాలు దీనిమీద అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్ తో కలిసి పర్యావరణ దినోత్సవం సందర్భంగా సురేష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

పర్యావరణ పరిరక్షణకు అందరూ ముందుకు రావాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు.. శుక్రవారం కూడా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,413 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,38,990కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 83 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11,296కి చేరుకుంది.

ఏపీ సీఐడి అదనపు డిజీకి షాక్: లీగల్ నోటీసు పంపిన రఘురామ కృష్ణంరాజు లాయర్...

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 6, ప్రకాశం 8, అనంతపురం 8, తూర్పుగోదావరి 7, చిత్తూరు 14, గుంటూరు 6, కర్నూలు 5, నెల్లూరు 4, కృష్ణ 6, విశాఖపట్నం 5, శ్రీకాకుళం 7, పశ్చిమ గోదావరి 11, ప్రకాశం 3, కడపలో ఒకరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 15,469 మంది కోలుకున్నారు. 

దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 15,93,921కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 85,311 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,96,19,590కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,33,773 మంది చికిత్స పొందుతున్నారు.