కరోనా దెబ్బ: ఏపీలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

ఎంసెట్ సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షలను ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ మూడో వారానికి ఎంసెట్ ను వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
 

AP EAMCET and other Andhra Pradesh common entrance exams postponed

అమరావతి:ఎంసెట్ సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షలను ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ మూడో వారానికి ఎంసెట్ ను వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
 

also read:తెలంగాణలో ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా

సోమవారం నాడు మంత్రి సురేష్ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ ను ఈ నెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ఇదివరకే షెడ్యూల్ ప్రకటించింది.

జూలై 24వ తేదీన ఈ సెట్, జూలై 25న ఐసెట్ పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ ప్రకటించారు. ఆగష్టు 2వ తేదీ నుండి ఆగష్టు 4వ తేదీ వరకు పీజీ సెట్, ఆగష్టు 5న ఎడ్ సెట్, ఆగష్టు 7 నుండి ఆగష్టు 9వ తేదీ వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ ఉన్నత విద్యామండలి ప్లాన్ చేసింది.

అయితే కరోనా నేపథ్యంలో ఈ ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ ఇవాళ ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు.

డిగ్రీ విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టుగా మంత్రి తెలిపారు. ఏపీలో కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలను  తదుపరి ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కూడ అన్ని ప్రవేశ పరీక్షలను కేసీఆర్ ప్రభుత్వం కూడ వాయిదా వేసిన విషయం తెలిసిందే.



AP EAMCET and other Andhra Pradesh common entrance exams postponed

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios