బీజేపీలో చంద్రబాబు కోవర్టుగా పురందేశ్వరి : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు

దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో చంద్రబాబు కోసం కోవర్టుగా పనిచేస్తున్నారంటూ ఆరోపించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి . చంద్రబాబును పంపించేసి నారా లోకేష్‌ను సీఎంగా చేయాలనే ఉద్దేశ్యంలో టీడీపీ నేతలు వున్నారని ఆయన ఆరోపించారు. 

ap dy cm narayanswamy sensational comments on bjp leader daggubati purandeswari ksp

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. మంగళవారం చిత్తూరు జిల్లాలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో నారాయణ స్వామి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో చంద్రబాబు కోసం కోవర్టుగా పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు రకరకాలుగా చెబుతున్నారని నారాయణ స్వామి మండిపడ్డారు. 

చంద్రబాబు జైలులో అన్నాన్ని ప్రభుత్వం పెట్టడం లేదని స్వయంగా ఆయన భార్య భువనేశ్వరి పంపుతున్నారని డిప్యూటీ సీఎం అన్నారు. జైల్లో దోమలు కుడుతున్నాయని అంటున్నారని.. వాటి ద్వారా మేం ఏమైన విషం పంపిస్తున్నామా అని నారాయణ స్వామి ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది నిజమా కాదా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబును పంపించేసి నారా లోకేష్‌ను సీఎంగా చేయాలనే ఉద్దేశ్యంలో టీడీపీ నేతలు వున్నారని నారాయణ స్వామి ఆరోపించారు. వాళ్లు ఒక స్టేట్‌మెంట్ కూడా నిజం చెప్పడం లేదని డిప్యూటీ సీఎం దుయ్యబట్టారు. 

Also Read: చంద్రబాబు ఆర్థిక నేరగాడు... ఇప్పట్లో బెయిల్ రానే రాదు : వైసిపి ఎమ్మెల్యే సంచలనం (వీడియో)

అంతకుముందు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పట్లో జైల్లోంచి బయటకు వచ్చే అవకాశాలు లేవని ఆయన అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తీవ్రమైన ఆర్థిక నేరాలకు చంద్రబాబు పాల్పడ్డారు... ఆ కేసులు చాలా కఠినమైనవి కావడంతో ఆయనకు ఇప్పట్లో బెయిల్ రాదని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేసారు. గతంలోనే చంద్రబాబు అవినీతి అక్రమాలపై 40 కి పైగా కేసులు వేసినట్లు ఎమ్మెల్యే ఆళ్ల తెలిపారు. 

రాజధాని అమరావతి పేరిట దళిత ఎస్సీ, ఎస్టీలతో పాటు వెనుకబడిన మైనారిటీ, బిసి ల భూములను కూడా చంద్రబాబు లాక్కున్నాడని... వాటిని తన బినామీలకు పంచారన్నారు. ఇలా పేదల జీవితాలపై కొడుతూ  చంద్రబాబు చేసిన భూ దోపిడీలు మామూలుగా లేవని ఆళ్ల ఆరోపించారు. POA యాక్ట్, POT యాక్టుల ప్రకారం చంద్రబాబు ఆర్థిక నేరగాడని ఎమ్మెల్యే అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడి జైలుకి వెళ్లిన చంద్రబాబుకు కేవలం నెల రోజుల్లోనే బెయిల్ వచ్చే ప్రసక్తే లేదని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios