Asianet News TeluguAsianet News Telugu

డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పట్లో లేనట్లే, ప్రకటించిన మంత్రి గంటా

డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ఇప్పట్లో ఉండే అవకాశాలు లేవని, వాయిదా వెస్తున్నట్లు స్వయంగా ఏపి మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. దీంతో నేడో, రేపో నోటిఫికేషన్ వస్తుందని ప్రిపరేషన్ ని ముమ్మరం చేసిన అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యారు.

ap dsp notification postponed

10,351 పోస్టులతో ఓ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ను జూలై 6 వతేదీన విడుదల చేయనున్నట్లు గతంలో గంటా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ టీచర్ పోస్టుల కోసం ఎపి లోని నిరుద్యోగులు గట్టిగా ప్రిపేరవుతున్నారు. అయితే ఇవాళ పదవ తరగతి సప్లిమెంటరీ పలితాలను విడుదల చేసిన మంత్రి మాట్లాడుతూ... డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ వాయిదాకు గల కారణాలను కూడా మంత్రి వివరించారు. పాఠశాల విద్యాశాఖ నుండి ఈ పోస్టుల అనుమతి కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఆర్థిక శాఖ నుండి అనుమతి లభించకపోవడంతో ఈ నోటిఫికేషన్ ని వాయిదా వేస్తున్నట్లు మంత్రి గంటా తెలిపారు. అయితే ఆర్థిక శాఖ త్వరలోనే అనుమతిస్తుందని భావిస్తున్నట్లు, ఆ అనుమతి రాగానే వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి వేగంగా టీచర్ల భర్తీ జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ ప్రకటనతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో కోచింగ్ లు, మెటీరియల్ పేరుతో చాలా డబ్బులు ఖర్చు చేశామని ఇప్పుడు వాయిదా వేస్తే తమ పరిస్థితి ఏంటని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం జోక్యం చేసుకుని రెండు శాఖలను ఒప్పించి నోటిఫికేషన్ విడుదలయ్యేలా చాడాలని డిఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios