AP DSC 2025 Merit List: ఆంధ్రప్రదేశ్ మెగా DSC (District Selection Committee) 2025 మెరిట్ లిస్ట్ శుక్రవారం రాత్రి అధికారిక వెబ్‌సైట్‌లలో విడుదలైంది. అభ్యర్థులు తమ ఫలితాలను DSC అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 

AP DSC 2025 Merit List: ఓ ఉత్కంఠకు తెరపడింది. ఎంతో మంది నిరుద్యోగుల కలనెరవేరింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ మెగా DSC (District Selection Committee) 2025 మెరిట్ లిస్ట్ శుక్రవారం రాత్రి అధికారిక వెబ్‌సైట్‌లలో విడుదలైంది. అభ్యర్థులు అందులోకి వెళ్లి మీ ర్యాంకును చూసుకోవచ్చు. ఇప్పటికే మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు మెసేజ్‌లు పంపించారు. వారు మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రావాలని పిలుస్తున్నారు. ఇప్పుడు ప్రకటించిన మెరిట్ జాబితాలో సబ్జెక్టుల వారీగా స్టేట్‌లో, జోనల్, జిల్లాలో ఎంత ర్యాంకు వచ్చిందో వివరంగా చెప్పారు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి:

  • అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in ఓపెన్ చేయాలి.
  • హోమ్‌పేజీలో “AP DSC 2025 ఫలితాలు” లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అవసరమైన వివరాలు (లాగిన్, రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్) నమోదు చేయాలి.
  • Submit బటన్ క్లిక్ చేస్తే రిజల్ట్ వస్తుంది.
  • డౌన్‌లోడ్ చేసుకుని, సేవ్ చేసుకోవాలి.

నియామక ప్రక్రియ:

  • విభిన్న కేటగిరీల పోస్టుల నియామకంలో ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందజేయబడుతుంది. 
  • DSC, TET స్కోర్ల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లతో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి.
  • వెరిఫికేషన్ పూర్తయ్యాక తుది ఎంపిక జాబితా ప్రకటించబడుతుంది.
  • ఎంపికైన అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ నియామక ఉత్తర్వులు జారీ చేస్తుంది, ఆ తర్వాత వారు కేటాయించిన పాఠశాలల్లో హాజరు కావాలి.

పోస్టుల వివరాలు:

మొత్తం 16,347 బోధనా పోస్టులు భర్తీ చేయబోతున్నాయి. అందులో 14,088 జిల్లా స్థాయి పోస్టులు ఉండగా, 2,259 రాష్ట్ర/జోనల్ స్థాయి పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు జూన్ 6 నుండి జూలై 6 వరకు DSC పరీక్షలు నిర్వహించారు. ఇక జూలై 8న ప్రాథమిక సమాధాన కీ, ఆగస్టు 2న తుది సమాధాన కీ విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాలను జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైన డాక్యుమెంట్లతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కేంద్రాల్లో హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు.