అమరావతి: మే 23న విజయోత్సవ యాత్రలకు ఎలాంటి అనుమతులు లేవని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రతీ కౌంటింగ్ కేంద్రం వద్ద నాలుగంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 

మెుదటి దశలో సెంట్రల్ పార్లమెంటరీ ఫోర్స్, రెండోదశలో ఏపీఎస్పీ పోలీసులు, మూడో దశలో జిల్లా పోలీసులు, నాలుగో దశలో పెట్రోలింగ్ టీమ్ ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ 30, 144 సెక్షన్లు అమలులో ఉన్నట్లు స్పష్టం చేశారు.  

ఈ ఎన్నికల్లో 25 వేల మందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెుత్తం 35 పారామిలటరీ బలగాలతోపాటు జిల్లా పోలీసులతో కలిసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు.