అమరావతి:  తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్  నోటీసులకు  ఏపీ డీజీపీ ఆర్‌పీ ఠాగూర్  మంగళవారం నాడు రిప్లై ఇచ్చారు. 

నాలుగు రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో  ఏపీకి చెందిన  ఇంటలిజెన్స్ అధికారులను తెలంగాణ పోలీసులు పట్టుకొన్నారు.ఈ విషయమై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి  ఏపీ డీజీపీ‌కి నోటీసులు పంపాడు.ఈ నోటీసులపై  ఏపీ డీజీపీ‌ ఆర్పీ ఠాగూర్  వివరణ ఇచ్చారు. ఏపీ ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీతో చర్చించి  ఈ ఘటనపై  పూర్తి సమాచారాన్ని ఇచ్చినట్టు డీజీపీ సీఈఓ రజత్ కుమార్ కు రిప్లై ఇచ్చారు.

నోటీసులో పేర్కొన్నట్టుగా వారంతా  తమ ఇంటలిజెన్స్ అధికారులేనని  డీజీపీ స్పష్టం చేశారు.  అయితే తమ ఇంటలిజెన్స్ అధికారుల వద్ద నగదు ఉందనేది అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. తమకు ఎన్నికల సంఘం పంపిన వీడియోలో ఎక్కడా కూడ నగదు లేదనే విషయాన్ని డీజీపీ గుర్తు చేశారు.

మావోయిస్టుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు గాను  తమ ఇంటలిజెన్స్ అధికారులు తెలంగాణకు వెళ్లారని ఆయన చెప్పారు. నిఘాలో భాగంగా ఇంటలిజెన్స్ సిబ్బంది ఎక్కడికైనా వెళ్లే హక్కుందని డీజీపీ గుర్తు చేశారు.  తెలంగాణలో కూడ ఏపీ ఇంటలిజెన్స్ యూనిట్ ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

ఆరుగురు ఎపి ఇంటలిజెన్స్ అధికారులు దొరికారు: రజత్ కుమార్

ఏపి ఇంటలిజెన్స్ తో తెలంగాణలో చంద్రబాబు కుట్రలు...సాక్ష్యాలివే...: కేటీఆర్