అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు బుధవారం నాడు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ హాజరయ్యారు.  అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలపై హైకోర్టు విచారణకు డీజీపీ గౌతం సవాంగ్ కోర్టుకు హాజరయ్యారు.

సీజ్ చేసిన వాహనాల విడుదలపై ప్రభుత్వ న్యాయవాది వివరణలతో హైకోర్టు సంతృప్తి చెందలేదు. డీజీపీని స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది.

మద్యం అక్రమ రవాణ చేస్తూ జప్తుకు గురైన వాహనాల్ని సంబంధిత మెజిస్ట్రేట్ లేదా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ముందు ఎందుకు ఉంచడం లేదో వివరణ ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ నిన్న ఆదేశాలు జారీ చేశారు.  వాహనాలను విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లు దాఖలయ్యాయి.

దీనిపై న్యాయమూర్తి సోమవారం నాడు విచారణ జరిపారు. డీజీపీని సుమోటో ప్రతివాదిగా చేర్చాడు. డీజీపీ గౌతం సవాంగ్ బుధవారం నాడు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్టణం జిల్లా పర్యటన సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలపై హైకోర్టుకు హాజరుకావాలని కూడ ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.