ఏపీలో సినిమా టికెట్ల అంశంపై (movie ticket price issue) వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (narayana swamy) తెలుగు సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో సినిమా టికెట్ల అంశంపై (movie ticket price issue) వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (narayana swamy) తెలుగు సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమ మూడు కుటుంబాల్లో చేతుల్లో ఉందని అన్నారు. సినీ పరిశ్రమలో 3 కుటుంబాల అధిపత్యమే కొనసాగుతుందని విమర్శించారు. పేదవాళ్లు కూడా సినిమా చూడాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. సినిమాలు ఆడకకుండా నిర్మాతలు నష్టపోయినప్పుడు హీరోలు ఆదుకోలేదని ఆరోపించారు. రాజకీయాల్లోనే కాదు సినీ పరిశ్రమలోనూ వారసత్వ రాజ్యం కొనసాగుతుందని అన్నారు. హీరోల గురించి ఎక్కువ మాట్లాడితే తనను ఓడించే ప్రయత్నం చేస్తారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టికెట్ల ధరలపై కమిటీ నిర్ణయం ప్రకారమే తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు.
సినిమా టికెట్ల ధరల వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు ఏపీలో నిబంధనలు పాటించని థియేటర్లను అధికారులు సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లతో థియేటర్లను నడపలేక కొందరు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమ పెద్దలు.. ప్రభుత్వంలో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరూ మాట్లాడొద్దని కోరిన దిల్ రాజు..
ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత Dil Raju మాట్లాడుతూ.. తమకు అపాయింట్‌మెంట్ ఇస్తే చిత్ర పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్‌తో, మంత్రులతో మాట్లాడాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు. తెలంగాణలో మాదిరిగానే ఏపీలో టికెట్ల రేట్లపై జీవో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో ఉన్న టికెట్ల రేట్లు, ఇతర సమస్యల పరిష్కారాని ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని అన్నారు. సినీ పెద్దలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఈలోగా సినిమా వాళ్లు ఎవరూ కూడా ఈ అంశంపై మాట్లాడవద్దని కోరారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నట్టుగా చెప్పారు.
Also Read: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో:హీరో నానికి మంత్రి పేర్ని నాని కౌంటర్
కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
ఇక, ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమించింది. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, సమాచార శాఖ కమిషనర్, న్యాయ శాఖ కార్యదర్శి, కృష్ణా జిల్లా కలెక్టర్, థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉంటారు. థియేటర్ల వర్గీకరణతో పాటు.. టికెట్ల ధరలపై నివేదికను ఈ కమిటీ ప్రభుత్వానికి అందజేయనుంది.
నాని, సిద్దార్థ్‌లకు పేర్ని నాని కౌంటర్..
అయితే మంగళవారం సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమైన ఏపీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రేట్ల గురించి మాట్లాడిన హీరోలు నాని, సిదార్థ్‌లకు కౌంటర్లు కూడా ఇచ్చారు. కొందరు ధియేటర్ల licenseలను రెన్యూవల్ చేసుకోకుండానే నడిపిస్తున్నారని మంత్రి పేర్ని నాని చెప్పారు.అనుమతులు లేకుండా నడుపుతేున్న సినిమా థియేటర్లను సీజ్ చేసినట్టుగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 130 థియేటర్లను సీజ్ చేశామన్నారు. గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. సమస్యలేమిటో చెబితే వినడానికి తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నుండి తమకు ఎలాంటి సమాచారం రాలేదని మంత్రి పేర్ని నాని తెలిపారు.
నాని ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో తనకు తెలియదని పేర్ని నాని అన్నారు. బాధ్యతతోనే ఆయన మాట్లాడి ఉంటారని అనుకుంటున్నట్టు సెటైర్ వేశారు. సిద్ధార్థ్.. తమిళనాడు సీఎం స్టాలిన్ పై అలా మాట్లాడి ఉండొచ్చన్నారు. సిద్ధార్థ్ ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో టాక్స్‌లు కట్టారా అని ప్రశ్నించారు. తాము ఎంత విలాసంగా ఉంటున్నామో సిదార్థ్ చూశారా అంటూ ఫైర్ అయ్యారు.
