Asianet News TeluguAsianet News Telugu

మీ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు ఎందుకు పంపుతున్నారు: టీచర్లు, ఉద్యోగులపై ఏపీ డిప్యూటీ సీఎం ఫైర్


ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీచర్లు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తప్పుబట్టారు.టీచర్లు తమ సమస్యలను నేరుగా సీఎంను కలిసి వివరిస్తే సరిపోయేదన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

AP Deputy CM Narayana Swamy fires on teachers
Author
Tirupati, First Published Jan 31, 2022, 5:24 PM IST

తిరుపతి: లక్షల్లో జీతాలు తీసుకొంటున్న employees, teachers తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో ఎందుకు చదివిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు.సోమవారం నాడు ఏపీ డిప్యూటీ సీఎం Narayana Swamy సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు.ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందన్నారు. ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ పై ఉపాధ్యాయులు అనుచితంగా మాట్లాడడం సరైందా అని ఆయన అడిగారు. తమ సమస్యలుంటే ఉపాధ్యాయులు లేదా ఉద్యోగులు సీఎం దృష్టికి తీసుకెళ్తే సరిపోయేదన్నారు. కానీ రోడ్డెక్కి నిరసనలు చేయడం సరైంది కాదన్నారు.

ప్రభుత్వ నిర్ణయానికి ఉద్యోగులు సహకరించాలని ఆయన కోరారు.  చర్చలకు పిలిచినా కూడా ఉద్యోగులు చర్చలకు రాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన PRC జీవోలను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.  ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె  నోటీసును అందించాయి. అంతేకాదు ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఇప్పటికే నాలుగు దఫాలు ఉద్యోగులను చర్చలకు పిలిచింది. అయితే ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను నెరవేరిస్తేనే చర్చలకు హాజరౌతామని చెప్పారు.

ఫిబ్రవరి 7వ తేదీ వరకు పలు రకాల ఆందోళనలను ఉద్యోగ సంఘాలు నిర్వహించనున్నాయి. తమ ఆందోళనల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. అప్పటికి కూడా ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే సమ్మెలోకి వెళ్లనున్నారు. ప్రభుత్వం మాత్రం చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరుతుంది. చర్చలకు రావడానికి ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వానికి షరతులు విధించాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios