చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ కుట్ర:రాజమండ్రిలో ముగిసిన వైసీపీ కాపు ప్రజా ప్రతినిధులభేటీ

రాజమండ్రిలో వైసీపీకి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన  ప్రజా ప్రతినిధులు ఇవాళ రాజమండ్రిలో  భేటీ అయ్యారు. రానున్న కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడ  ఈ సమావేశంలో చర్చించారు.
 

AP Deputy CM kottu Satyanarayana  Satirical comments On  Pawan Kalyan

రాజమండ్రి: చంద్రబాబును సీఎంగా చేసేందుకు పవన్ కళ్యాణ్  కుట్ర పన్నారన్నారని ఏపీ డిప్యూటీ  సీఎం కొట్టు సత్యనారాయణ విమర్శించారు.సోమవారంనాడు రాజమండ్రిలో వైసీపీకి చెందిన  కాపు ప్రజా  ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏపీ  డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ  మంత్రులు బొత్స సత్యనారాయణ లు  ఈ సమావేశంలో తీసకున్ననిర్ణయాలను మీడియాకు వివరించారు.చంద్రబాబు కోసమే  తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారన్నారు.

చంద్రబాబునాయుడుకాపులకు రూ.5 వేలకోట్లు ఇస్తానని  చెప్పిన హామీని నెరవేర్చలేదన్నారు.ఐదేళ్లలో చంద్రబాబు సర్కార్ రూ.1824  కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన విమర్శించారు. ప్రతి ఏటా కాపులకు రూ. 2 వేల కోట్లు ఇస్తానని జగన్  హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటికే రూ,26,495  కోట్లను కాపుల కోసం  తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు.

పీఆర్‌పీని దెబ్బతీసిన పార్టీలు, వ్యక్తులతోనే పవన్ కళ్యాణ్ కొమ్ముకాస్తున్నారని ఆయన ఆరోపించారు. 2014లో  చంద్రబాబుకు రాజకీయ లబ్ది కల్గించేందుకు గాను పవన్ కళ్యాణ్  పార్టీని ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. జనసేనను ఏర్పాటు చేసే సమయంలో పవన్  కళ్యాణ్ ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుతో  పవన్  కళ్యాణ్ అంటకాగడం సరికాదని ఆయన చెప్పారు. జగన్ కు  కాపు సామాజిక వర్గం వెన్నుదన్నుగా ఉందన్నారు. అందుకే 2019లో  వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుందన్నారు.

గత ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంకుగానే చూశాయని  ఏపీ రాష్ట్ర మంత్రి  బొత్స సత్యనారాయణ చెప్పారు.కాపు సామాజిక వర్గానికి జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కాపు సామాజిక వర్గానికి జగన్ సర్కార్ పెద్దపీట వేసిందని ఆయన చెప్పారు.కాపు నేస్తం ద్వారా మహిళలకు రూ.1500 ల నుండి రూ.2 వేల కోట్ల మేర లబ్ది జరిగిందని ఆయన చెప్పారు.త్వరలోనే విజయవాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన  ప్రజాప్రతినిధులందరితో సమావేశం కానున్నట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి అన్ని రకాల పదవుల్లో న్యాయం  చేసిందని  మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.

కాపు సామాజిక వర్గం సంక్షేమానికి జగన్  చేపట్టిన కార్యక్రమాలను  మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.వైసీపీలో ని  కాపు సామాజికవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులపై జనసేన చీఫ్ చేసిన విమర్శలను సమావేశం తీవ్రంగా ఖండించిందని  ఆయన చెప్పారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఇంకా ఏయే కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై  నివేదికను సీఎంకు అందించనున్నట్టుగా  ఆయన చెప్పారు.

కాపు సామాజిక వర్గానికి తాము ఏం నష్టం  చేశామో చెప్పాలని ఆయన  పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.ఎవరినో దూషించడం కోసం ఈ సమావేశం పెట్టుకోలేదన్నారు.అన్ని రకాలుగా కాపుల అభివృద్ది  కోసం తమ ప్రభుత్వం  పనిచేస్తుందన్నారు.175 స్థానాల్లో పోటీ చేసే సత్తా పవన్ కళ్యాణ్ కు సత్తా ఉందా అని ఆయన ప్రశ్నించారు. అందుకే  ఆయన 10 స్థానాల్లోనే పోటీ చేస్తున్నాడని చెబుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ కు సీఎం కావాలని లేదని  ఆయన చెప్పారు. చంద్రబాబు  కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios