తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిదే విజయం అని ఏపీ డిప్యుటీ సీఎం చినరాజప్ప అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు.. రేపు వెలువడనున్నాయి. కాగా.. దీనిపై ఉపముఖ్య మంత్రి చినరాజప్ప స్పందించారు.

రాష్ట్రాలను అణగదొక్కాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన  విమర్శించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి కేసులో సిట్ విచారణ జరుగుతోందన్నారు. కాపులకు న్యాయం చేసే ఏకైక పార్టీ టీడీపీనే అని ఆయన అన్నారు. ఏపీలో మైనారిటీలకు సీఎం చంద్రబాబు పెద్ద పీట వేశారన్నారు.  తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధిస్తుందని చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు.