ఏలూరు: వింత వ్యాధి వెనుక కూడ రాజకీయ కుట్ర కోణం ఉందని ఏపీ డీప్యూటీ సీఎం ఆళ్లనాని సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం నాడు ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు..  పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో వరుసగా వింత వ్యాధి కేసులు చోటు చేసుకొంటున్నాయి. 

 దెందులూరు మండలం కొమిరేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన తెలిపారు.జనం రోగాలతో బాధ పడుతుంటే  రాజకీయాలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. దేవాలయాలపై దాడులు జరిగిన ఘటనలను ఆయన ప్రస్తావిస్తూ రాజకీయాల కోసం గతంలో దేవుళ్లను రాజకీయాల్లోకి లాగారన్నారు. ఇప్పుడు ప్రజలను లాగుతున్నారని ఆయన మండిపడ్డారు. 

ఏలూరు పట్టణంలో తొలుత వింత వ్యాధి సోకింది. ఆ తర్వాత భీమడోలు మండలంలో ఇదే తరహలో వ్యాధి సోకింది. తాజాగా దెందులూరు మండలంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందింది.