సీఎం జగన్ హెలికాఫ్టర్ లో ఎంపీ విజయసాయి రెడ్డికి చోటివ్వలేదన్న ప్రచారంపై డిప్యూటీ సీఎం, వైద్య శాఖ మంత్రి ఆళ్లనాని స్పందించారు. బాధితుల పరామర్శకు సీఎం హెలికాఫ్టర్లో బయలుదేరారని, ఎంపీ విజయసాయిరెడ్డి హెలికాఫ్టర్‌లో తన స్థానాన్ని నాకు ఇచ్చారని మంత్రి చెప్పారు.

Also Read:పరిస్థితి అదుపులోనే ఉంది: వైఎస్ జగన్, వైజాగ్ కు పయనం

తన మీద గౌరవంతో సాయిరెడ్డి తన సీటిస్తే విష ప్రచారం చేస్తున్నారని.. విశాఖ ప్రమాదం కన్నా నీచ రాజకీయాలే ముఖ్యం అయ్యాయని ఆళ్లనాని చెప్పారు. దిగజారిన  వారి మానసిక స్థితి చూసి జాలి పడుతున్నానన్న ఆయన... తెలుగుదేశం పార్టీలో ఇలాంటి సంస్కారం ఎక్కడైనా కనిపిస్తుందా..? అని ఆయన ప్రశ్నించారు.

సీటు కోసం వెన్నుపోటుతో హత్యారాజకీయాలు చేసే పార్టీ టీడీపీయేనని నాని ఆరోపించారు. టీడీపీ శ్రేణులకు, వారి సామాజిక మాధ్యమాలకు ఇంతకన్నా పనేముందని ఆయన ధ్వజమెత్తారు.వైఎస్ కుటుంబంతో విజయసాయిరెడ్డిది ఆత్మీయ అనుబంధమని, ఆయన అంకిత భావం, చిత్తశుద్ధి శంకించలేనిదని ఆళ్లనాని వ్యాఖ్యానించారు.

Also Read:ఫ్యాక్టరీ రన్నింగ్ లో లేకపోవడం వల్లే ప్రమాదం: ఎల్జీ ఫ్యాక్టరీ జీఎం

ప్రజాసేవ కోసం విజయసాయిరెడ్డి ముఖ్యమత్రి జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తారని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. మాట మీద నిలబడ్డ నాయకుడి వెంటే నడుస్తున్నారని.. ప్రజల కోసం, నాయకుడి కోసం నిలబడ్డవారు ఒక్కరైనా టీడీపీలో ఉన్నారా అని ఆళ్లనాని నిలదీశారు.