అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అంటేనే గాలి అని ఏపీ డిప్యూటీ సీఎం  కెఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలి మాటలు మాట్లాడడం పవన్ కళ్యాణ్‌కు అలవాటుగా మారిపోయిందని ఆయన ఆరోపించారు. 

శుక్రవారం నాడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై  కెఈ కృష్ణమూర్తి  సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం పవన్ కళ్యాణ్ అలవాటు చేసుకొన్నారని కెఈ కృష్ణమూర్తి ఆరోపించారు.  ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చిన తర్వాత టిడిపిపై పవన్ కళ్యాణ్  విమర్శలు ఎక్కువయ్యాయని ఆయన చెప్పారు. 

ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. టిటిడిపై బిజెపి, వైసీపీ, జనసేనలు కలిసి కుట్రలు చేస్తున్నాయని కెఈ ఆరోపించారు.టిటిడిలో ఏదో జరుగుతోందనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

వచ్చే ఎన్నికల్లో వైసీపీ, పవన్ కళ్యాణ్ లు కలిసే వెళ్తాయనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని కెఈ అభిప్రాయపడ్డారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కంటే వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని కెఈ పవన్ కు సూచించారు.