అయిన వాళ్లకి అందినకాడికి దోచిపెట్టడం రాష్ట్రప్రభుత్వం విధానం లాగా ఉంది. దీనికి సదావర్తిభూముల విక్రయం సాక్ష్యం. కారు చవకగా సదావర్తి భూములను ప్రభుత్వపెద్దల సన్నిహితులకుకట్టబెట్టడం, ఇందులో మోసమొందని శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుకు వెళ్లడం, కోర్టు బహిరంగ వేలం వేయాలని ఆదేశించడం తెలిసిందే. చివరకు వేలంలో అది పాత రేటు కంటే కనీసం 35 కోట్లు ఎక్కువ పలకడం చూశాం ఇపుడిలాంటి కుంభకోణమే విద్యుత్ కొనుగోలులో జరుగుతూ ఉన్నట్లు బయటపడింది. ఒక ప్రైవేట్‌ పవన విద్యుత్‌ కంపెనీకి భారీ ఆర్థిక ప్రయోజనం కల్పించేలా రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ కంపెనీలకు భారీ నష్టం వచ్చే ప్రమాదం ఉంది.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ తో పాటు , ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ అభ్యంతరాలు చెప్పినా ఖాతరు చేయడం లేదు. 
అసలీ  విద్యుత్ అవసరమే లేదని పవన విద్యుత్‌ కొనుగోలు చేయడమంటే ఇటు వినియోగదారులను, అటు డిస్కమ్‌లను ముంచేయడమేనని ఇంధనశాఖ ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే డిస్కమ్‌లకు మునిగిపోవడం గ్యారంటీ అని  ప్రధాన కార్యదర్శ అభిప్రాయం ఫైల్ మీద రాశారని కూడా తెలిసింది
అయినా సరే భారీ ముడుపులకోసం రాష్ట్ర ప్రజలపై రూ.1000 కోట్లకు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద వేసేందుకు ఏలినవారు నిర్ణయించారు. మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా అధిక ధరపెట్టాలని నిర్ణయించారు. ఇదొకభారీ కుంభకోణమని అధికారుల మధ్య గుసగుసలుమొదలయ్యాయి.  తమిళనాడుకు చెందిన ఒక పవన విద్యుత్‌ ప్రాజెక్టు యూనిట్‌ 3.46 రూపాయలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా, సుజ్లాన్‌ కంపెనీ నుంచి  పవన విద్యుత్‌ యూనిట్‌ రూ.4.84గా ఏపీఈఆర్‌సీ నిర్థారించింది. ఇది  ఖాజానా మీద భారమని,అందునా అనసర భారమని అంతా చెబుతున్నారు. ప్రస్తుతం నిజానికి చాలా అగ్గువకు విద్యుత్ దొరుకుతూఉంది. కొనేవాళ్లు లేక విద్యుత్ కంపెనీ అగచాట్లు పడుతున్నాయియ. అయినే సరే రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరలకు కొనుగోలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తుండటపట్ల ఇండియన్‌ ఎనర్జీ ఎక్సే్చంజ్‌ (ఐఈఎక్స్‌) ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ గతంలోనే హెచ్చరించింది.