Asianet News TeluguAsianet News Telugu

ఏపి అప్పు రూ 2.05 లక్షల కోట్లు

  • ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ చంద్రబాబునాయుడు వల్ల నవ్యాంధ్రకు ఏమిరా లాభమంటే మూడున్నరేళ్ళలో పరిమితికి మించిపోయిన అప్పులు.
  • సమైక్య రాష్ట్రంలో కూడా ఏపి అప్పుల్లోనే ఉంది.
  • రాష్ట్ర విభజన నేపధ్యంలో అప్పులను విడదీస్తే 13 జిల్లాల ఏపికి రూ. 96 వేల కోట్ల భారం పడింది.
Ap debts crosses Rs 2 lakh Cr

‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ చంద్రబాబునాయుడు వల్ల నవ్యాంధ్రకు ఏమిరా లాభమంటే మూడున్నరేళ్ళలో పరిమితికి మించిపోయిన అప్పులు. సమైక్య రాష్ట్రంలో కూడా ఏపి అప్పుల్లోనే ఉంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో అప్పులను విడదీస్తే 13 జిల్లాల ఏపికి రూ. 96 వేల కోట్ల భారం పడింది. సరే అప్పు ఎంతైనా తప్పదు కదా చేసేదేమీ లేదని జనాలు కూడా సరిపెట్టుకున్నారు.

అయితే, తాజా లెక్కల ప్రకారం చూస్తే ఏపి అప్పులు ఏకంగా రూ. 2.05 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే 60 సంవత్సరాల సమైక్య రాష్ట్ర చరిత్రలో విభజన నాటికి 13 జిల్లాల వాటాగా ఏపికి రూ. 96 వేలు కోట్లు భారం పడితే, కేవలం మూడున్నరేళ్ళల్లోనే రూ. 1.09 లక్షల కోట్లు అదనపు భారం వచ్చి మీదపడింది.

విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో జనాలు చంద్రబాబును ఎందుకు ఎన్నుకున్నారు. అనుభవజ్ఞుడనే కదా ? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పింది కూడా అదేకదా? మరి, సీనేంటి రివర్స్ అయింది. అంటే ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది ఏమిటంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎందుకు పనికిరావటం లేదని.

లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్ర పరిస్ధితి చంద్రబాబు ఏలుబడిలో ‘పెనం మీదనుండి పొయ్యిలోకి వచ్చిపడినట్లై’పోయింది. అందుకు కారణాలేంటి అందరూ చూస్తున్నదే. అందరికీ కనబడుతోంది అదుపులేని ఖర్చులు, మితిమీరిన డాబుసరి వ్యయాలు, ఎక్కడికెళ్ళినా ప్రత్యేక విమానాలు..ఇలాంటి ఖర్చులు వంద చెప్పవచ్చు.

అయితే, పైకి కనిపిస్తున్న ఖర్చులకన్నా కనబడని ఖర్చులు ఇంకా ఎన్ని ఉన్నాయో ఎవరికీ అర్దం కావటం లేదు. ఎందుకంటే, ఎంత దుబారా చేసినా, డాబుసరి ఖర్చులు చేసినా, నిధుల దుర్వినియోగమైనా మూడున్నరేళ్ళల్లో రూ. 1.09 లక్షల కోట్ల అప్పులు చేయాల్సి రావటం ఆందోళనకరమే.

ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయాన్ని వేల కోట్లకు పెంచేయటం లాంటి వాటి వల్లే అప్పు ఏకంగా రూ. 2.05 లక్షల కోట్లకు చేరుకుందని నిపుణులు ఆందోళన చేస్తున్నారు. పాలనలో చంద్రన్న జోరు చూస్తుంటే మరో ఏడాదిన్నరలో ఈ అప్పు మూడు లక్షల కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

Follow Us:
Download App:
  • android
  • ios